‘అన్ సెన్సార్డ్’ వెర్షన్ రిలీజ్ అవుతోంది!

Arjun Reddy- uncensored version amazon primeతెలుగునాట సెన్సేషన్ సృష్టించిన “అర్జున్ రెడ్డి” సినిమా అన్ సెన్సార్డ్ వెర్షన్ విడుదలకు సిద్ధమైంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సెన్సార్ బోర్డుపై చిత్ర హీరో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ తో ఈ సినిమా అన్ సెన్సార్డ్ వెర్షన్ కు క్రేజ్ లభించింది. ఏపీ, తెలంగాణాలలో కట్స్ తో కూడిన సినిమానే ప్రదర్శితం కాగా, యుఎస్ లో మాత్రం అన్ సెన్సార్డ్ వెర్షన్ దర్శనమిచ్చింది. మంచు లక్ష్మి తదితర సెలబ్రిటీలు తమకు “అర్జున్ రెడ్డి” అన్ సెన్సార్డ్ మూవీ కావాలంటూ సోషల్ మీడియా వేదికగా తమ భావాలను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే.

ఇలా “అర్జున్ రెడ్డి” అన్ సెన్సార్డ్ వెర్షన్ కు ఏర్పడిన డిమాండ్ దరిమిలా, ఈ నెల 13వ తేదీన ఆన్ లైన్ లో ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ద్వారా ఈ సినిమా విడుదల కాబోతోంది. టాలీవుడ్ లో ‘గేమ్ చేంజర్’గా మారిన ఈ సినిమాకున్న క్రేజ్ తెలియనిది కాదు. దీంతో అందరి చూపులు 13వ తేదీ వైపుకు మళ్ళాయి. అన్ సెన్సార్డ్ తో పాటు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించిన మాదిరే ఆన్ లైన్ లోనూ ఈ సినిమా కనకవర్షం కురిపిస్తుందేమో చూడాలి. దీని కోసం సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా వేచిచూస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories