నేతలకు అచ్చేదిన్, వేతన జీవులకు మీ చావు మీరు చావండి దిన్!

arun-jaitley-budget-2018-good-for-politicians2018-19 ఆర్థిక సంత్సరానికి సంబంధించి సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కాబట్టి ఎమన్నా వెసులుబాటు ఇస్తారేమో అని వేచి చుసిన సగటు వేతనదారులకు నిరాశే ఎదురయ్యింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పు లేదని జైట్లీ ప్రకటించారు.

ఈ ప్రకటన చేసేటప్పుడు గతంలోనే వేతన జీవులకు చాలా చేసేశామని ఇక చెయ్యనవసరం లేదన్నట్టుగా జేట్లీ చెప్పారు. కొంత వెసులుబాటు ఏమిటంటే ఉద్యోగస్తులు ప్రయాణ, వైద్య ఖర్చుల నిమిత్తం 40,000 స్టాండర్డ్‌ డిడక్షన్‌ ప్రకటించారు. గతంలో వీటి కోసం బిల్లులు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఎలాంటి బిల్లులు లేకుండా ప్రతి ఒకరు క్లెయిమ్ చేసుకోవచ్చు.

ADVERTISEMENT

దీనివల్ల ఇది కంటి తుడుపు చర్యగానే భావించవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే మూలిగే నక్క మీద తాటి పండు వేసినట్టు వేతన జీవులు కట్టే టాక్స్ మీద వేసే విద్య, వైద్య సెస్సు 4% కి పెంచారు. పన్ను మినహాయింపులల్లో వేతన జీవులకు ఊరటనివ్వని అరుణ్‌ జైట్లీ రాష్ట్రపతి వేతనాన్ని 5 లక్షలకు, ఉపరాష్ట్రపతి వేతనాన్ని 4లక్షలకు, గవర్నర్ల వేతనాలను 3.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

ఇటు పార్లమెంట్‌ సభ్యుల జీతభత్యాలపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి ఐదేళ్లకు ఒకసారి ద్రవ్యోల్బంను అనుసరించి పెరుగుతాయని చెప్పారు. మరి ద్రవ్యోల్బం ఆధారంగా వేతన జీవులకు జీతాలు పెరుగుతున్నాయి? ద్రవ్యోల్బం ఆధారంగా ఆదాయపు పన్ను మీద వెసులుబాటు ఇస్తున్నారా?

ADVERTISEMENT
Latest Stories