తెలుగు రాష్ట్రాలకు అరకొర కేటాయింపులు.. వాటి వివరాలు

arun jaitley- budget 2018 to telugu statesకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఈరోజు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో రెండు రాష్ట్రాలకు సంబంధించి ఊసైనా లేదు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ విద్యా సంస్థలు, కేంద్ర సంస్థలకు కేటాయింపులు చేశారు. అవి కూడా అరకొర నిధులు లానే కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు ఇలా..

* విశాఖ పోర్టుకు రూ.108కోట్లు.

* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీకి రూ.32కోట్లు.

* కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు.

* గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు.

* ఎన్‌ఐటీకి రూ.54కోట్లు.

* ఐఐటీకి రూ.50కోట్లు.

* ట్రిపుల్‌ ఐటీకి రూ.30కోట్లు.

* ఐఐఎంకు రూ.42కోట్లు,

* ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49కోట్లు,

* డ్రెడ్జింగ్‌ కార్పోరేషన్‌కు రూ.19.62కోట్లు.

తెలంగాణకు కేటాయింపులు ఇలా..

* హైదరాబాద్‌ ఐఐటీకి రూ.75కోట్లు.

* గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు.

సింగరేణికి రూ.2 వేల కోట్లు.
తెలంగాణ ట్రైబల్‌ వర్సిటీకి రూ.10 కోట్లు.
ఐఐటీకి రూ.75 కోట్లు.
ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీకి రూ.32 కోట్లు.

ADVERTISEMENT
Latest Stories