ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగారు. “టీడీపీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా. మరి ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటారు? ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ స్ఫూర్తి ఇప్పుడు ఎక్కడికి పోయింది?,” అని అసద్ కాంగ్రెస్ టీడీపీ పొత్తుపై విమర్శలు కురిపించారు.
[m9ad]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఆ రాష్ట్రానికి ఏమీ చేయలేని చంద్రబాబు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారు?. తెలంగాణ ఎన్నికల తరువాత ఏపీ వచ్చి చంద్రబాబు నాయుడు అవినీతిని బయటపెడతాం అని హెచ్చరించారు. కాంగ్రెస్ కు సడన్ గా అసద్ ఇంత వ్యతిరేకం ఎందుకయ్యారో? మొన్నటివరకు కాంగ్రెస్ తో చెట్టా పట్టాలు చేసుకుని తిరిగింది వీరేగా?
బయటకు బీజేపీ అని చెప్పుకుంటున్నా ఈ మధ్య ముస్లిమ్ ఓట్లు కాంగ్రెస్ కు పడతాయి అనుకున్న ప్రతి చోటా ఎంఐఎం పోటీ చేసి బీజేపీకి మేలు చేసింది నిజం కాదా? విలువల గురించి అసద్ ఎలా మాట్లాడగలరు? ఇప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాకా ముస్లిం ఓట్లు టీడీపీకి పడే అవకాశం ఉంది కాబట్టి అసద్ ఏపీకి వస్తాం అంటున్నారా?



