టీడీపీ ఎంపీలూ …. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం?

Avanthi Srinivasa Raoవిశాఖ రైల్వేజోన్‌ సాధన కోసం ఈ నెల 4న తెలుగుదేశం పార్టీ ఎంపీలందరితో కలిసి విశాఖపట్నంలో దీక్ష చేయనున్నట్లు అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. కడప ఉక్కు కర్మాగారం కోసం ఎంపీ సీఎం రమేష్‌ ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేసినా కేంద్రంలో చలనం కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు అయితే ఇటీవలే లీకైన వీడియోలో టీడీపీ ఎంపీలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అందరికి తెలిసిందే. ఆ వీడియోలో అవంతి శ్రీనివాస్ స్వయంగా జోను లేదు గీనూ లేదు అనడం అందరు చూశారు. అదే వీడియోలో 5 కేజీలు బరువు తగ్గడానికి వారం రోజులు దీక్ష చేస్తా అని మరో ఎంపీ మురళి మోహన్ అనడం కూడా చూశాం.

దాని తరువాత ఏదో రకంగా కవర్ చెయ్యడానికి ట్రై చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇటువంటి సమయంలో వీళ్ళు దీక్షకు కూర్చున్నా లాభం ఏముంటుంది? పైగా ఒక రోజు దీక్షతో…. ప్రజాజీవితంలో ఉండగా నోరు అదుపులో పెట్టుకోకపోతే ఏమవుతుందో వారికి ఇప్పటికే అర్ధమయ్యుండాలి.

ADVERTISEMENT
Latest Stories