‘రాధిక ఆప్టే’ తర్వాత కలకలం రేపిన ‘అవికా గోర్’

Avika Gor Controversial Comments on Tollywoodతెలుగు సినిమా ఇండస్ట్రీపై ‘లెజెండ్’ హీరోయిన్ రాధిక ఆప్టే రేపిన వ్యాఖ్యల ఉదంతం ఎంత కలకలం రేపిందో తెలిసిన విషయమే. ‘తనతో శారీరకంగా గడిపితే గానీ అవకాశం ఇవ్వనని ఓ హీరో తనకు ఆఫర్ ఇచ్చాడంటూ’ పేరు చెప్పకుండా చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్ గా హల్చల్ చేసాయి. అయితే తాజాగా ‘చిన్నారి పెళ్లికూతురు’ ముద్దుగుమ్మ అవికా గోర్ ఓ యువహీరోను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోన్న విషయం.

తాజాగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా ద్వారా మరో విజయాన్ని సొంతం చేసుకున్న అవికా గోర్ కు, టాలీవుడ్ కు సంబంధించిన ఓ యువ హీరో అసభ్య పదజాలంతో వాట్సప్ లో సందేశాలు పెడుతున్నారట. తొలుత ఎవరో ఆకతాయి ఈ పని చేస్తున్నారని తెలిసి ‘లైట్’ తీసుకున్న అవికా, ఆ సందేశాలు పంపుతోంది ఎవరో కాదు, ఓ యువ హీరో అన్న విషయం తెలిసి అవాక్కయ్యిందట. దీంతో ఈ విషయాన్ని టాలీవుడ్ లో తన సన్నిహితులైన రాజ్ తరుణ్, నిఖిల్, సాయిధరమ్ తేజ్, హేబ్బా పటేల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారికి చెప్పుకుందట.

ADVERTISEMENT

అంతేకాదు, తెలుగు సినీ పరిశ్రమలో పని చేయాలంటేనే విరక్తి కలుగుతోందని, తోటి నటీమణులతో హీరోలు ప్రవర్తించే తీరు ఏ మాత్రం బాగోవడం లేదంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా ట్రేడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోన్న విషయం. వాట్సప్ లో బూతు సందేశాలన్నీ తొలగించిన అవికా గోర్ కు ఆ “అడల్ట్” సందేశాలు పంపిన యువహీరో ఎవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తెలుగు యువ కధానాయకులపై ఆరోపణలు బాగానే వస్తున్నాయని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories