అయేషా మీరాను హత్య చేయడానికి అసలు కారణం!

Ayesha-Meera-death mysteryఅయేషా మీరా హత్య కేసులో ఇప్పటివరకు పోలీసులు, సెషన్స్ కోర్టు నిందితుడిగా పేర్కొన్న సత్యంబాబు‌ను నిర్దోషిగా పేర్కొంటూ శుక్రవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన అయేషా మీరా తల్లిదండ్రులు… అసలు దోషులను పట్టుకుని శిక్షిస్తేనే, తమ కుమార్తె ఆత్మకు శాంతి కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. సత్యంబాబు నిర్దోషి అని తొలి నుంచి తాము చెబుతూనే ఉన్నామని అయేషా తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషాలు పేర్కొన్నారు.

ADVERTISEMENT

హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ నోరు తెలిస్తే ఈ కేసు ఐదు నిమిషాల్లోనే పరిష్కారమవుతుందని అన్నారు. కోనేరు పద్మ, ఆమె భర్త అయినంపూడి శివరామకృష్ణ, హాస్టల్ విద్యార్థులు సౌమ్య, ప్రీతి, కవిత, కోనేరు సురేశ్, కోనేరు సతీష్, అబ్బూరి గణేశ్, చింతా పవన్‌ కుమార్‌ లకు ఈ కేసుతో సంబంధం ఉందని, వారే అసలు నిందితులని పేర్కొన్నారు. వారి రాసలీలలను అయేషా చూసిందనే కారణంతోనే తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్నారని, కేసును తిరిగి దర్యాప్తు చేసి అసలు దోషుల్ని పట్టుకోవాలని షంషాద్ బేగం విజ్ఞప్తి చేశారు.

ADVERTISEMENT
Latest Stories