జగన్ దృష్టిలో నేరానికి కులం, వయస్సు …మినహాయింపులా.?

Jagan’s Remarks on Crime, Age Spark Fresh Political Row

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న కొన్ని ప్రకటనలు ఆయనకు చట్టం, న్యాయం మీద ఉన్న అవగాహనకు అద్దం పడుతున్నాయి. తమ్ముడు తనవాడైన ధర్మం చెప్పాలి అనే న్యాయానికి వయస్సు చూడాలంటూ ఒకసారి, కులాన్ని ప్రామాణికంగా పాటించాలంటూ మరోసారి జగన్ చేస్తున్న ప్రకటనలు సామాన్యుడిని సైతం ఆచర్యానికి గురి చేస్తున్నాయి.

విజయవాడ సాయికృష్ణ వివాదం లో కూడా సాయికృష్ణ కులం ఆధారంగా వైసీపీ రాజకీయం నడిపింది. 21 ఏళ్ళ వయసున్న సాయికృష్ణ మీద ఇప్పటికే 23 కేసులున్నట్టు మీడియాలో తీవ్ర స్థాయిలో వార్తలు ప్రచారం జరిగిన ఈ నేపథ్యంలో,

ADVERTISEMENT

జగన్ అతని కి న్యాయం చెయ్యాలని అనే ఆదేశంతో ఆయన కులాన్ని తెరమీదకు తేవడం, తద్వారా కాపు కులాల్ని రెచ్చకొట్టాలని చూడడం, అదే సామాజికవర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కి ఆ వివాదాన్ని అంటగట్టాలని భావించడం వైసీపీ నేరానికి కుల ముద్ర వేస్తున్న అన్న భావనలోకి తీసుకెళ్లింది.

అలాగే సాయికృష్ణ వివాదం మీద స్పందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాయికృష్ణ చాల చిన్నపిల్లోడని, తెలుసో తెలియకో నేరాలు చేసుంటాడని, ఆయన నేర చరిత్రను వెనసుకురావడం అందుకు ప్రభుత్వానికి ఆయన వయస్సుని పరిగణలోకి తీసుకోవాలని చెప్పడం కాస్త ఆచార్యాన్ని కలిగించిన అంశమే.

ఇక నేడు విశాఖ మత్శ్యకార కుటుంబాల పరామర్శకు వెళ్లిన జగన్ అక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు చేసిన యాక్సిడెంట్ సంఘటన మీద తనదయిన శైలిలో స్పందించారు.

సిదిరి కుమారుడి వయస్సు 18 సంవత్సరాలు, ఆ చిన్నపిల్లోడు ఎదో తెలిసో తెలియకో బైక్ నడిపి ఒకరి చావుకు కారణం అయితే అతని మీద కూటమి ప్రభుత్వం మర్డర్ కేసు పెట్టడం అమానుషం, అన్యాయం, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, ఆ పిల్లోడికి ఎం తెలుస్తుంది.? అంటూ ఒక వ్యక్తి చావుకి కారణమైన వారికి జగన్ మద్దతుగా మాట్లాడడంతో జగన్ దృష్టిలో నేరానికి కులం, వయస్సు ప్రామాణికం అయ్యిందా అన్న కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.

గతంలో కూడా ఇదే మాదిరి గంజాయి బ్యాచ్ కి మద్దతుగా వారి కోసం పరామర్శ యాత్ర చేసిన జగన్ వారి నేరాలను కూడా వయస్సుతో ముడిపెట్టి చిన్నోళ్లు తెలిసి తెలియని వయస్సు అంటూ వారి నేర ప్రవృత్తి వయస్సు అనేది మినహాయింపు అనేలా ప్రకటనలు చేసారు.

ఇక వివేకా దారుణ హత్యలో వివేకా కుటుంబం నుంచి ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాష్ రెడ్డి ని కూడా జగన్ చిన్నపిల్లోడు అంటూ సంభోదించడం ఇప్పుడు మరోసారి జగన్ ఈ చిన్నపిల్లోడో కాన్సెప్ట్ చర్చకొస్తుంది. నేరాలు చేసే వారి వయస్సు చిన్నదైతే ప్రభుత్వాలు నడిపేవారు వారి వయస్సుని పరిగణలోకి తీసుకుని, వారి కులాన్ని ప్రామాణికంగా పట్టించుకుని బాధితులకు కాకుండా నేరస్తులకు అండగా ఉండాలని జగన్ భావిస్తున్నారా.?

సిదిరి తనయుడి బైక్ డ్రైవ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుడి గురించి జగన్ కి పట్టదా.? వారి కుటుంబ ఆవేదన జగన్ పరిగణలోకి తీసుకోలేరా.? సిదిరి కుమారుడి కోసం గళం విప్పిన జగన్ సదరు బాధిత కుటుంబం గురించి కనీసం ఒక్కసారైనా ఆలోచించారా.?

ఇలా జగన్ చెప్పినట్టుగా యాక్సిడెంట్ చేసిన వారి వయస్సుని, నేరం చేసే వారి కులాన్ని ఆధారంగా చట్టాలు పనిచేయాలి, ప్రభుత్వాలు మినహాయింపు ఇవ్వాలి అనుకుంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సఖ్యంగా సాగుతుందా.? బాధితులకు న్యాయం జరుగుతుందా.? జగన్ ఇదే చెప్పాలనుకుంటున్నారా.?

ADVERTISEMENT
Latest Stories