నేడు ఏవత్ భారతావని అయోధ్య వైపు చూస్తుంది. ఈ రోజు అయోధ్య రామందిర నిర్మాణంతో బాల రాముడు “రామ్ లల్లా” విగ్రహ ప్రాణప్రతిష్ఠతో శతాబ్దాల నాటి హిందువుల కల సాకారం కానుంది.
దారులన్నీ అయోధ్య వైపే, చూపులన్నీ బాలరాముడి మీదే అన్నట్లుగా రాజకీయ ప్రముఖుల నుండి సినీ, క్రీడా రంగ సెలబ్రేటిస్ వరకు అందరు “జై శ్రీ రామ్” నినాదంతో అయోధ్యకు చేరుకున్నారు.
‘ఇష్టానికి కాకుండా ధర్మానికి కట్టుబడి’ రాజ్యపాలన కొనసాగించిన శ్రీ రాముడి జీవిత గాధ, రామాయణ ఇతిహాసం ఎప్పటికి మరువలేనిది, ఎన్నటికీ చెరిగిపోనిదనే చెప్పాలి. ఎన్నో సంవత్సరాల న్యాయపోరాటాల తరువాత వచ్చిన తీర్పుతో 2020 న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈరోజు మధ్యాహ్నం 12 .29 నిముషాలకు శ్రీరాముడు ప్రాణప్రతిష్టకు ముహూర్తం ఖరారయ్యింది. దీనితో కన్నులపండుగ గ అయోధ్య ముస్తాబయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ పెద్దలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అయోధ్య రామమందిర నిర్మాణం చేపట్టారు.
అయోధ్య రామమందిర నిర్మాణం రాజకీయంగా ఎవరికీ మేలుచేస్తుంది, ఎవరిని అధికారం దిశగా నడిపిస్తుంది అనే లెక్కలను కాసేపు పక్కన పెడితే ప్రభుత్వాలకు చేయాలి అనే చిత్త శుద్ధి ఉంటే ఎంత వరకు వెళ్లగలదో అనేది ఈ అయోధ్య రామమందిర నిర్మాణంతో నిరుపించారు రెండు ప్రభుత్వాలు.
ఆ రామ్ లల్లా ఆశీస్సులు…దేశ ప్రజలందరి మీద ఉండాలని m9 కోరుకుంటుంది. “జై శ్రీ రామ్”. సర్వేజనా సుఖినోభవంతు.




