చరణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతూ స్వీయదర్శకత్వం వహించిన “ఆయుష్మాన్ భవ” సినిమా ఫస్ట్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘రగిలే నీ రుధిరం’ అంటూ సాగిన పాట ఆద్యంతం పవర్ ఫుల్ గా ఉంది. రెండు కుల, మతాల మధ్య తెరకెక్కిన ప్రేమ, పెళ్లి గాధగా కనపడుతున్న ఈ సినిమాకు మారుతీ సహనిర్మాత.
అలాగే నానితో ‘నేను లోకల్’ వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన త్రినాధరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా తెరకెక్కింది. టాలీవుడ్ టాప్ రచయితలు పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను నవంబర్ 9వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ఈ టీజర్ ధృవీకరించారు. మీట్ బ్రోస్ సంగీతం అందించగా, బ్యాక్ గ్రౌండ్ మాత్రం భీమ్ స్వరపరిచాడు.
ADVERTISEMENT
ADVERTISEMENT



