100వ సినిమాపై బాలయ్య బాబు ప్రకటన!

Balakrishna's 100 after this Amavasyaఅభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి నటసింహం 100వ సినిమా గురించి ఒక ప్రకటన చేసారు బాలకృష్ణ. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో “రైతు,” క్రిష్ దర్శకత్వంలో “గౌతమీపుత్ర శాతకర్ణి” కథలు రెడీగా ఉన్నాయని, ఏది ఫైనల్ అవుతుందని ఇప్పుడే చెప్పలేనని, ఈ అమావాస్య వెళ్లిన తరువాత నిర్ణయం తీసుకుంటానని ఓ స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారు బాలయ్య.

ఇక, మొన్నటి వరకు వార్తల్లో నిలిచిన “ఆదిత్య 369” సీక్వెల్ కు ఇంకా సమయం ఉందని, దానిలో తనతో పాటు మరో ప్రధాన పాత్రలో మోక్షజ్ఞ కూడా నటిస్తాడని వివరించారు. విషయాన్ని నాన్చకుండా అభిమానులను గందరగోళానికి గురికాకుండా ఒక అధికారిక సమాచారాన్ని వెల్లడించడం పట్ల నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇదే విషయంలో మెగాస్టార్ చిరంజీవి తన అభిమానుల సహనాన్ని పరీక్షించడంతో, బాలయ్య బాబు 100వ సినిమా ప్రకటన కూడా ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories