రాజకీయ నాయకులు ఒక్కోసారి పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు తడబడటం మాములే. అయితే గతంలో లోకేష్ ని ఈ విషయం గానే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు టార్గెట్ చేసేవారు. ఇప్పుడు అటువంటి సందర్భాలే ఆ పార్టీ నాయకులకు ఎదురువవుతున్నాయి. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ర్యాలీలో పాల్గొన్న తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తడబడి సొంత పార్టీపైనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘‘ గేట్లు తెరిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ లో ఎవరూ మిగలరు’’ అంటూ వ్యాఖ్యానించారు.
దుర్గాప్రసాద్ వ్యాఖ్యలతో అక్కడున్న అధికార పార్టీ నాయకులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే పక్కనే ఉన్న నేతలు ఆ వ్యాఖ్యలను సరిచేయడంతో తమాయించుకున్న ఎంపీ.. తిరిగి సొంత పార్టీకు అనుకూలంగా మాట్లాడారు.అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలో అమరావతికి అనుకూలంగా యాత్రలు చెయ్యడం తో, అధికార పార్టీ వారు కూడా వాటికి పోటీగా ప్రదర్శనలు చేస్తున్నారు. 29 రాజధాని గ్రామాలలో 10 గ్రామాలు ఉన్న మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా మూడు రాజధానులు అనుకూలంగా ర్యాలీ చెయ్యడం విశేషం.





