మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా దత్తన్న మోడీ భక్తి

Bandaru Dattatreya on Ameertpet - LB Nagar Metro Railఅమీర్‌పేట-ఎల్బీనగర్ మార్గంలో మెట్రో రైలు అట్టహాసంగా ప్రారంభమైంది. గవర్నర్ నరసింహన్, మంత్రులు నాయిని, కేటీఆర్, తలసాని, కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ దత్తాత్రేయ ప్రారంభించారు. అనంతరం అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ ట్రైనులో వెళ్తుండగా మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అలకబూనారు.

ADVERTISEMENT

[m9ad]

మెట్రో రైలుపై ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రైన్ ఎంజీబీఎస్‌ స్టేషన్‌కు రాగానే దత్తాత్రేయ మధ్యలో దిగిసి వెళ్లిపోయారు. అయితే ఆయనను సముదాయించే ప్రయత్నం తెలంగాణ మంత్రులు ఎవరూ చెయ్యకపోవడం గమనార్హం. గత నవంబరులో ప్రధాని మోదీ తొలి విడతగా 30 కి.మీ. మెట్రో మార్గాన్ని ప్రారంభించారు.

సుమారు 10 నెలల తర్వాత గవర్నర్‌ మరో 16 కి.మీ. మార్గాన్ని నేడు గవర్నర్ ప్రారంభించారు. ఇక అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ 11 కి.మీ. మార్గం ఈ ఏడాది చివరి నాటికి, జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ 9 కి.మీ. మార్గం వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి చేస్తామని మెట్రో అధికారులు చెబుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories