అసెంబ్లీ ముందస్తు ఎన్నికలతో బ్రేక్ పడిన బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో చీరల పంపిణీపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఎన్నికల కమిషన్ నిలిపివేయాలని ఆదేశించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో అధికారులు చీరల పంపిణీపై దృష్టి పెట్టారు. వచ్చే వారం బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. బతుకమ్మ పండగ కోసం ప్రభుత్వం 95 లక్షల చీరలను సేకరించిన సంగతి తెలిసిందే.
[m9ad]
ఎన్నికల ముందే జిల్లాలకు కూడా చీరలు తరలించినా… చివరి నిమిషంలో పంపిణీకి బ్రేక్ పడింది..అప్పటి నుండి ఆ చీరలు గోదాములలోనే మగ్గుతున్నాయి. ఇక పంచాయతీ ఎన్నికల కోడ్ వచ్చేలోపు చీరలను పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ చీరాల పంపిణి అధికార పార్టీకి కలిసి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత సంవత్సరం బతుకమ్మ చీరాల పంపిణీ సందర్భంగా ఎన్నో వివాదాలు చెలరేగాయి. నాసి రకం చీరలు పంచి పెడుతున్నారని ప్రభుత్వంపై మహిళలు కన్నెర్ర చేశారు.
రోడ్ల పైకి వచ్చి నిరసన వ్యక్తం చేసి చీరలను తగలబెట్టారు. మంత్రి కేటీఆర్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంది. చీరాల పంపిణీ పూర్తి కాగానే పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఇటీవలే ఎన్నికలలో ఘోర పరాజయం నుండి ఇంకా తెలుకొని ప్రతిపక్షాలపై ఈ ఎన్నికలు పిడుగుపాటుగా ఉండబోతుంది. ప్రతిపక్షాల అసహాయతను ఆసరాగా చేసుకుని దాదాపుగా అన్ని సీట్లలో పాగా వెయ్యాలని అధికార పార్టీ యోచన.



