వై…వైసీపీ టార్గెట్ పవన్ కళ్యాణ్.?

YSRCP Targets Pawan Kalyan

కొంతమంది చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారు, అయితే దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు, కానీ ఆ కాలిన గాయాలకు ఆ ఆకులు ఎంతోకొంత ఉపశమనం అందిస్తాయని భావన ఉంటుంది. అయితే వైసీపీ చేతులు పూర్తిగా కాలిపోయిన తరువాత కూడా ఆకులకు బదులు మళ్ళీ అదే నిప్పును పట్టుకుంటుంది.

గత 2024 ఎన్నికలకు ముందు వరకు వైసీపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా అనేక విమర్శలు చేసింది. ఆయన మూడు పెళ్లిళ్ల నుంచి నలుగురు పిల్లల వరకు ఎక్కడా తగ్గేదెలా అన్నట్టుగా పవన్ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ వేదికలెక్కించింది.

ADVERTISEMENT

రాజకీయాలకు అసలు సంభందమే లేని పవన్ తల్లిని, ఆయన సతీమణి ని చివరికి ఆయన పిల్లలని కూడా అత్యంత నీచాతి నీచంగా విమర్శించింది వైసీపీ అండ్ కో. ఇక వైసీపీ మద్దతుదారుల పేరుతో సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ఉన్మాదుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే సమాజానికి అంత మేలు అన్నట్టుగా రెచ్చిపోయారు.

ఇక సినీ పరిశ్రమ నుంచి ఎప్పుడో మరుగున పడిపోయిన దర్శకుడు రాంగోపాల్ వర్మను రంగంలోకి దింపారు, ఇక ఆయనకు తోడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణ మురళిని ఉసిగొల్పారు. ఇలా పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూనే మరోపక్క ప్యాకేజీ స్టార్ అని, బాబు దత్తపుత్రుడని పొలిటికల్ గా అణిచివేసేందుకు సిద్ధమయ్యారు.

దానికి తోడు అటు సామాజికవర్గం పరంగా కూడా పవన్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కాపు నాయకుడిగా గుర్తింపు పొందిన ముద్రగడను పవన్ కు వ్యతిరేకంగా తెరమీదకు తెచ్చారు. ఇక వైసీపీ కాపు నేతలైన అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమరనాథ్ వంటి నాయకులను అడ్డుపెట్టుకుని పవన్ పై విమర్శలు సాగించారు.

అటు పవన్ సినిమాల విషయంలోనూ వైసీపీ టార్గెటెడ్ రాజకీయాలు నడిపింది. ఇలా పవన్ పై అకారణంగా, అన్యాయంగా రాజకీయ దాడి చేసిన వైసీపీ 2024 ఎన్నికలలో పవన్ ఇచ్చిన “హలో ఏపీ బై బై వైసీపీ” నినాదం ముందు 151 నుంచి 11 కి పడి తలవంచింది.

అయినా వైసీపీ కి ఇప్పటికి తత్త్వం భోదపడినట్టు లేదు. ఇప్పటికి పవన్ పట్ల వైసీపీ అదే రకమైన టార్గెటెడ్ పాలిటిక్స్ చేస్తూ పవన్ ను రెచ్చకొడుతుంది, జనసేనను నిత్యం మీడియాలో ఉంచుతుంది. పవన్ కు సంభందం లేని వివాదాలలోకి ఆయనను లాగుతూ పవన్ మీద విషం చిమ్ముతుంది వైసీపీ.

సాయికృష్ణ వివాదం అసలు పవన్ కు సంబంధం లేని అంశం. అక్కడ కూడా కులాన్ని వాడుకుని పవన్ ను ఆ వివాదంలో ఇరికించాలని వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అలాగే సుగాలి ప్రీతి కేసు విషయంలోనూ బాధిత కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ పవన్ కు వ్యతిరేకంగా కథ నడిపిస్తుంది అనే ప్రచారం సాగుతుంది.

ఇక జడ్ శ్రావణ్, ప్రశ్న రావణ్, ప్రకాష్ రాజ్ వెనుక కూడా వైసీపీ ఛాయలు కనిపిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో గట్టి ప్రచారమే నడుస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ ఎం జరిగినా అందుకు పవన్ ను టార్గెట్ చేయడం, పవన్ కేంద్రంగా వైసీపీ రాజకీయం నడపాలని చూడడం వైసీపీ చేస్తున్న మరో పెద్ద రాజకీయ తప్పిదం కానుందా.?

సనాతనధర్మన్ని అవహేళన చేసేందుకు పవన్ ను తెరముందు పెడుతున్నారు వైసీపీ శ్రేణులు. హిందూ దేవాలయాల మీద వార్తలు వినిపిస్తే చాలు వేర్ ఈజ్ మన సనాతని.? అంటూ సెటైర్లు వేయడం వైసీపీ రాజకీయంలో ఒక భాగంగా మారిపోయింది.

ఇక తాజాగా హోమ్ గార్డులకు ఇచ్చిన హామీల అమలు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మీడియా ముందుకొచ్చిన పేర్ని నాని హోమ్ మంత్రికి బదులు పవన్ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు. కానిస్టేబుల్ కొడుకు పవన్ ఈ హామీల అమలు సంగతేంటి అంటూ వెటకారాలు మొదలుపెట్టారు పేర్ని.

ఇలా రాష్ట్రంలో ఏ మూలా ఏ సమస్య ఎదురయినా, ఎక్కడ ఏ వివాదం కనిపించినా, ఎక్కడ ఎం జరిగినా, ఏం జరగకపోయినా దాన్ని పవన్ కు ముడిపెట్టడం, పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా, రాజకీయంగా టార్గెట్ చేసేందుకు సిద్దమవ్వడం వైసీపీ రాజకీయం గా మారింది.

గత ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమికి గల కారణాలలో పవన్ పై వైసీపీ సాగించిన ఇటువంటి రాజకీయం కూడా ఒక కారణమంటూ స్వయంగా వైసీపీ నాయకులే బహిరంగా ఒప్పుకున్నారు. అయినా కానీ వైసీపీ ఇప్పుడు కూడా అదే తరహా రాజకీయాన్ని నమ్ముకుని ఇలా ముందుకెళ్లడం తో వై పవన్ అంటూ వైసీపీ కి ఎదురు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories