నినాదాలే..ఉద్యమాలా.? ఉద్యమాలే రాజకీయాలా.?

BC quota stir reshapes Telangana politics

తెలంగాణలో పురుడుపోసుకున్న ఒక నినాదం ఉమ్మడి రాష్ట్రాన్ని రెండుగా చీల్చింది, ఇప్పుడు అదే తెలంగాణలో పైకి లేస్తున్న మరో నినాదం తెలంగాణను ఎటువైపుకి నడిపిస్తుందో అన్న ఆసక్తి తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.

అయితే నాడు ఆ నిండు నంది పలికి ఆ నినాదాన్ని ఉద్యమ రూపంలోకి మార్చి దానికి నాయకత్వం వచ్చిన కేసీఆర్ తెలంగాణ ను పదేళ్ల పాటు అటు రాజకీయంగా ఇటు సామాజికంగా శాసించారు.

ADVERTISEMENT

మరి ఇప్పుడు ఈ నినాదాన్ని మోస్తున్న వారిలో ముఖ్య నాయకుడు ఎవరు.? దానిని ఉద్యమ రూపంలోకి తీసుకెళ్లే ఆ ముఖ్య నేత ఎవరు.? వారి ప్రాబల్యం తెలంగాణ రాజకీయాలను ఏవిధంగా ప్రభావితం చేయనుంది.?

నాటి ‘ప్రత్యేక తెలంగాణ’ నినాదం తెలంగాణలో అన్ని పార్టీలను ఎలా అయితే ఏకం చేసిందో నేడు 42% ‘బీసీ రిజర్వేషన్’ అంశం సైతం తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకొస్తుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ బీసీ రిజర్వేషనల అంశం పై తగ్గేదెలా అన్నట్టుగా న్యాయస్థానాల వరకు పోరాటం చేసినా ఫలితం మాత్రం శూన్యం.

కోర్ట్ తీర్పు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రావడంతో తెలంగాణ బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య “బంద్ ఫర్ జస్టిస్” పేరుతో రేపు రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు. అయితే కృష్ణయ్య ఇచ్చిన ఈ పిలుపుకి అటు ప్రతిపక్ష బిఆర్ఎస్

తో పాటుగా బిఆర్ఎస్ నుంచి వేరు కుంపటికి సిద్దమవుతున్న కవిత కూడా జాగృతి పేరుతో మద్దతు పలికింది.

ఇక కృష్ణయ్య బీజేపీ రాజ్యసభ నాయకుడు కావడంతో బీజేపీ నే కృష్ణయ్యతో తెరచాటు ఉద్యమం నడిపిస్తుంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే కృష్ణయ్య ఇచ్చిన పిలుపుకి బీజేపీ కూడా సంపూర్ణ మద్దతు పలకడం, ఇక అధికార కాంగ్రెస్ మేమే దగ్గరుండి ఈ బంద్ ని విజయవంతం చేస్తామంటూ ముందుకు రావడంతో ఈ అంశం అన్ని రాజకీయ పార్టీల ఓటు బ్యాంకు ప్రయోజనాలకు అద్దం పడుతుంది.

ADVERTISEMENT
Latest Stories