టీవీ సీరియల్ షూటింగ్ లో అగ్నిప్రమాదం!

behad Serial Sets On FIre Accidentవెండితెరకు ఎంత క్రేజ్ ఉందో, ప్రస్తుతం బుల్లితెరకు కూడా అంతే క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. దీంతో బుల్లితెరపై ప్రదర్శించే కార్యక్రమాలను కూడా అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో నిర్మాణం చేస్తున్నారు. అందులో భాగంగానే నిర్మాణం జరుగుతోన్న హిందీ సీరియల్ ‘బేహద్’ షూటింగ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తోటి నటి జెన్నీఫర్ వింగెట్ ను నటుడు కుషాల్ టాండన్ రక్షించాడు.

ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపిన కుషాల్, దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశాడు. షూటింగ్ లో భాగంగా పెళ్లి వేడుకను చిత్రీకరిస్తుండగా, అకస్మాత్తుగా మంటపానికి మంటలు అంటుకున్నాయని, పెళ్లి పీటలపై కూర్చుని ఉన్న జెన్నీఫర్ ఈ విషయాన్ని గ్రహించలేదని, వెంటనే, అప్రమత్తమైన తాను మంటపం నుంచి ఆమెను బయటకు తీసుకువచ్చానని చెప్పాడు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories