Nenu Student Sir Movie Talkయూత్ హీరోలకు స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ అంటే మంచి ఉత్సాహం వస్తుంది. అందులో డౌట్ లేదు. అందుకే బెల్లంకొండ గణేష్ నేను స్టూడెంట్ సర్ టైటిల్ దగ్గరే ఇంప్రెస్ అయినట్టున్నాడు. తేజ లాంటి అగ్ర దర్శకుల దగ్గర శిష్యరికం చేసిన రాఖీ ఉప్పలపాటి దానికి ఐఫోన్ కాన్సెప్ట్ ముడిపెట్టడంతో ఇంకేమి ఆలోచించకుండా ఓకే చెప్పి ఉండొచ్చు. సముతిరఖని లాంటి సీనియర్ ఆర్టిస్టుతో పాటు నాంది టైపు అభిరుచి కలిగిన సినిమాలు తీసిన బ్యానరంటే రెండో సినిమాకి ఇంత కంటే ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు.

ముందు కథ సంగతి చూద్దాం. జీవితంలో ఐఫోన్ 12 సొంతం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న సుబ్బు(బెల్లంకొండ గణేష్)ఆఖరికి డబ్బంతా పోగేసి కొంటాడు. దానికి తమ్ముడు బుజ్జికన్నా అని పేరు పెడతాడు. తీరా చూస్తే మొదటి రోజే కాలేజీలో ఎవరో చేసుకున్న కొట్లాటలో మనోడి ఫోన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటుంది. తర్వాత మొబైల్ మిస్. ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని ఏకంగా పోలీస్ కమీషనర్ (సముతిరఖని)కి వార్నింగ్ ఇస్తాడు. అసలు మలుపులు ఇక్కడ స్టార్ట్. ఒక పెద్ద స్కామ్ మూలాలు బయటపడతాయి.

హీరోకు పోలీస్ కమీషనర్ కు మధ్య జరిగిన క్లాష్ లో బయటి ప్రపంచానికి తెలియని ఒక బ్యాంకింగ్ స్కామ్ ని ముడిపెట్టాలనే ఆలోచన బాగానే ఉంది. ఇలాంటివి తెరకెక్కిస్తున్నప్పుడు స్క్రీన్ ప్లేతో పాటు మొదటి నుంచి చివరి దాకా లీనమయ్యే వేగం చాలా అవసరం. ఫోన్ పోయి సుబ్బు నిస్సహాయుడిగా మారాక మొదలయ్యే లవ్ స్టోరీ ముప్పావు గంట పాటు ఇంటర్వెల్ వచ్చే దాకా దారి తెన్నూ లేకుండా సాగుతుంది. విశ్రాంతికి ఇచ్చిన ట్విస్ట్ తో అలెర్ట్ అవుతాం. సెకండ్ హాఫ్ మీద అమాంతం ఆశలేం పెరగవు కానీ సర్ ప్రైజ్ కోసం చూస్తాం.

రాఖీ ఉప్పలపాటి బోలెడు ట్విస్టులు పెట్టారు. ప్రతి పదినిమిషాలకోసారి మలుపులు వస్తూనే ఉంటాయి. కానీ ఏవీ రిజిస్టర్ అయ్యేంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. ప్రాధమికంగా హీరో క్యారెక్టరైజేషనే అయోమయంగా ఉంది. ఓసారి బిత్తిరి చూపులతో మహా భయంగా ఉంటాడు. కాసేపటికే మిర్చిలో ప్రభాస్ రేంజ్ లో వార్నింగ్ ఇస్తాడు. ఇంకో షాట్ లో స్వాతిముత్యం ఎక్స్ ప్రెషన్. అది కాగానే నాయక్ లో రామ్ చరణ్ అయిపోతాడు. ట్రాన్స్ ఫార్మేషన్ ని సరిగా డిజైన్ చేసుకోనప్పుడు వచ్చే ఇబ్బందులివి. అందుకే ఏదీ నమ్మశక్యంగా ఉండదు.

సరే హీరో హీరోయిన్ రొటీన్ లవ్ స్టోరీకి క్షమించి పక్కనపెట్టినా లాజిక్స్ లేకుండా సాగే అసలు హంతుకుల వేట సిల్లీగా నడిపించేశారు. సుబ్బు కోసమే పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి. అంత పెద్ద కేసులో ఇరుకున్న హీరో వేలాది కెమెరాల్లో కనిపిస్తున్నా సరే పోలీసులు పట్టుకోలేకపోతారు. ఇదేదో పెట్టీ కేసు తరహాలో హోమ్ మినిస్టర్, డిజిపిలు తమ కింది ఆఫీసర్లకు మొక్కుబడి సూచనలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటారు. ఇలా అడుగడుగునా కథనం లోపాలతో సాగుతూ ఎగ్జైటింగ్ గా అనిపించే ఏ మూమెంట్ ఇవ్వలేదు.

ఇక్కడ స్టోరీ బ్యాడ్ అవ్వలేదు. దర్శకుడి రాత బలహీనంగా ఉండటం వల్ల అవుట్ ఫుట్ వీక్ అయ్యింది. దానికి తోడు మహతి స్వరసాగర్ సంగీతం కొంత భాగం తప్పించి ఏ దశలోనూ ఆకట్టుకునేలా లేదు. కెమరా పనితనం అంతంత మాత్రమే. మెయిన్ విలన్ల క్యాస్టింగ్ తేడా కొట్టింది. వీళ్లా అసలు నిందితులు అని నమ్మేలా లేకుండా ఆర్టిస్టుల ఎంపికలో తప్పు చేశారు. బెలూన్ ఎంత కలర్ ఫుల్ గా అయినా ఉండొచ్చు. కానీ దాంట్లో గాలి ఉంటేనే ఆకాశంలో ఎగురుతుంది. అది లేనప్పుడు అందం ఎక్కడిది. నేను స్టూడెంట్ సర్ కూడా అంతే.