బాలకృష్ణ అభిమాని కార్యాలయం సీజ్!

bellamkonda-suresh-office-seized-by kotak-mahindra-bankనందమూరి బాలకృష్ణతో ‘చెన్నకేశవరెడ్డి, లక్ష్మినరసింహ’ వంటి పలు సినిమాలు నిర్మించి, తన అభిమాన హీరో బాలయ్య బాబే అని వివిధ సందర్భాలలో ప్రకటించిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ ఆఫీస్ మూతపడింది. హైదరాబాద్ ఫిలింనగర్ లో ఉన్న బెల్లంకొండ కార్యాలయాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ వారు సీజ్ చేసారు.

వ్యాపార అవసరాల నిమిత్తం కోటక్ మహీంద్రా బ్యాంక్, సోమాజిగూడ బ్రాంచ్ లో బెల్లంకొండ తీసుకున్న ఋణం తిరిగి చెల్లించలేకపోతున్నందున ఈ కార్యాలయాన్ని సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం దాదాపుగా 7 నుండి 10 కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం. బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు రుణాల రూపంలో తీసుకుని, తిరిగి చెల్లించని ఢిఫాల్టర్ల జాబితాలోకి టాలీవుడ్ ప్రొడ్యూసర్ కూడా తన స్థానాన్ని పదిలపరచుకున్నారన్నమాట.

ADVERTISEMENT

ప్రొడక్షన్ మేనేజర్ స్థాయి నుంచి నిర్మాతగా ఎదిగిన బెల్లంకొండ అగ్ర హీరోలతో పను సినిమాలను నిర్మించినప్పటికీ, ఇటీవల కాలంలో డబ్బింగ్ చిత్రాల వైపుకు మొగ్గు చూపారు. ప్రస్తుతం తన కుమారులను సినీ హీరోలుగా నిలబెట్టేందుకు కోట్లు కుమ్మరిస్తున్నారని ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తున్న టాక్. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రెండు సినిమాలలో తమన్నా ఐటెం సాంగ్స్ ప్రభావం దీని పర్యవసానమే అని సినీ వర్గాలు అప్పట్లోనే నోరెళ్ళబెట్టాయి.

ADVERTISEMENT
Latest Stories