‘పిల్ల జమీందార్… సుకుమారుడు’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అశోక్, తాజాగా ‘భాగమతి’ హిట్ తో తన సత్తా చాటుకున్నాడు. దాంతో సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి కబురు వచ్చిందనే టాక్ ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తోంది. నిజానికి ‘భాగమతి’ సినిమాకి ముందే సురేష్ ప్రొడక్షన్స్ లో వెంకటేశ్ హీరోగా అశోక్ ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపించాయి. అది కూడా మూకీ సినిమా అని ప్రచారం జరిగింది.
అయితే వెంకటేశ్ కోసం రెడీ చేసిన కథతో చాలాకాలం పాటు తిరిగాడట. కానీ అటు వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో, ‘భాగమతి’పై దృష్టి పెట్టి హిట్ కొట్టడంతో, సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి పిలుపు వచ్చిందని సమాచారం. మరి గతంలో వినిపించిన కథనే ఓకే చేస్తారా? లేదంటే కొత్త కథతో రమ్మంటారోననేది ఆసక్తికరంగా మారింది. వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్ కాకపోతే, మరో ప్రాజెక్టుతో… మరో హీరోతో ముందుకు వెళ్లాలనే ఆలోచనతో అశోక్ ఉన్నాడని తెలుస్తోంది.



