గత రెండేళ్ళుగా ఎదురుచూసిన విజయం తమ దరికి చేరిందన్న ఉత్సాహంతో ప్రిన్స్ మహేష్ బాబుతో పాటు ఆయన అభిమానులు కూడా ఉన్నారు. ఇదే ఉత్సాహంతో… ‘భరత్ అనే నేను’ సక్సెస్ సెలబ్రేషన్స్ ను తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సెలబ్రేషన్స్ వేడుక వాయిదా పడిందనేది తాజా సమాచారం.
వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడిన ప్రభావం రీత్యా, ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో… 27వ తేదీన కూడా అలాంటి పరిస్థితులు నెలకొంటాయన్న సంచారంతో ఈ వేడుకను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. అయితే త్వరలో డేట్ అండ్ వెన్యూను ఫిక్స్ చేసి అభిమానులకు తెలుపుతామని స్పష్టం చేసారు. దీంతో తాత్కాలికంగా ‘భరత్’ పట్టాభిషేకానికి బ్రేక్ పడినట్లయ్యింది.
ADVERTISEMENT
ADVERTISEMENT



