సిఎం చాంబర్ లోకి ఎంటరైన ప్రిన్స్!

Bharath Ane Nenu Shooting in progressకొరటాల శివ కాంబోలో ఎప్పుడైతే “భరత్ అనే నేను” టైటిల్ వినిపించిందో, అప్పటినుండి అభిమానులతో పాటు మార్కెట్ వర్గాల్లోనూ హంగామా చేస్తున్న చిత్రంగా నిలుస్తోంది. నిజానికి ‘స్పైడర్’ కంటే ఈ సినిమా పైనే బజ్ ఎక్కువగా ఏర్పడడం విశేషం. దానికి తగ్గట్లే చిత్రీకరణ విషయంలోనూ ఎక్కడా రాజీపడకుండా సాగుతోందన్నది ట్రేడ్ న్యూస్.

ADVERTISEMENT

అసెంబ్లీ కోసం ప్రత్యేక సెట్ ను నిర్మించిన చిత్ర యూనిట్ ఇటీవల అందులో షూటింగ్ ముగించగా, తాజాగా మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి చాంబర్ లో చిత్రీకరణ మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్ లో ప్రిన్స్ తో పాటు హీరోయిన్ కైరా అద్వాని మరియు ప్రకాష్ రాజ్ తదితరులు పాల్గొంటున్నారు. నవంబర్ 8 వరకు నిరంతరాయంగా ఈ షెడ్యూల్ కొనసాగనుంది.

వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా పెట్టుకున్న ఈ సినిమాకు ఫోటోగ్రఫీని రవి కె చంద్రన్ అందిస్తుండగా, సంగీత బాధ్యతలను దేవిశ్రీప్రసాద్ సమకూరుస్తున్నారు. ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’ సినిమాలకు మంచి సాహిత్యాన్ని అందించిన రామజోగయ్య శాస్త్రి, ‘భరత్ అనే నేను’కు కూడా కలం పట్టారు. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories