చిన్న పిల్లోడు రామ్మోహన్ నాయుడు భోగాపురం విమానాశ్రయం నిర్మించగలిగితే…

Bhogapuram International Airport

ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు పాలకులు దాని విలువ, వారి ఆకాంక్షలు గ్రహించి అందుకు అనుగుణంగా పాలన సాగించాలి. కానీ మేము చేసిందే పాలన అన్నట్లు వ్యవహరించకూడదు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొదలు ప్రపంచ వ్యాప్తంగా రెండో రకం పాలకులే ఎక్కువగా కనిపిస్తారు.

భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి మరికొద్ది సేపటిలో ప్రధాని మోడీ ప్రారంభిస్తారు.

ADVERTISEMENT

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అదే సమయంలో టీడీపి ఎంపీ రామ్మోహన్ నాయుడు పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉండటం బాగా కలిసి వచ్చింది.

సిఎం చంద్రబాబు నాయుడు, రామ్మోహన్ నాయుడు ఇద్దరూ ప్రత్యేక శ్రద్ధ వహించినందునే కేవలం రెండేళ్ళలో ఇంత పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయ్యింది. నేడు ప్రారంభోత్సవం జరుపుకుంటోందని వేరే చెప్పక్కర లేదు.

ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు రాజకీయ జీవితంలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుంది. తనను ఎంపీగా ఎన్నుకొని పార్లమెంటుకి పంపినందుకు ఆయన ఈవిధంగా ప్రజల రుణం తీర్చుకున్నారని చెప్పవచ్చు.

అయన తెలంగాణతో సహా దేశంలో పలు రాష్ట్రాలలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకి కృషి చేస్తున్నారు. అవన్నీ కూడా ఆయన రాజకీయ జీవితంలో సాధించిన విజయాలకు చిహ్నాలుగా ఎప్పటికీ నిలిచిపోతాయి. కనుక వాటి గురించి ఆయన, అదేవిధంగా ఆయన గురించి ఆయా రాష్ట్రాలు ఎప్పటికీ చెప్పుకుంటాయి.

రామ్మోహన్ నాయుడుకి పౌరవిమానయానశాఖ మంత్రి పదవి లభిస్తే ఇంత చిన్న వయసులో జిల్లా, రాష్ట్ర ప్రజలు గర్వపడేలా ఇలాంటి గొప్ప పనులు చేసి చూపిస్తున్నారు.

మరి మూడు రాజధానులు+మావిగన్‌ కనిపెట్టిన జగన్‌కి ప్రజలు అధికారం కట్టబెడితే 5 ఏళ్ళ పాలనలో ఏం చేశారు? పొలాలలో సర్వే రాళ్ళు మొదలు స్కూలు బ్యాగుల వరకు తన ఫోటోలు, పేరు, పార్టీ రంగులు వేయించుకున్నారు. ఆవిధంగా ప్రజల మనసులలో స్థానం సంపాదించుకోవాలనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

జగన్‌ కంటే వయసులో, అనుభవంలో చాలా చిన్నవాడైన రామ్మోహన్ నాయుడు ఇంత పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించి చూపిస్తే, ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కృష్ణనదికి రీటేయినింగ్ వాల్ నిర్మించానని చెప్పుకోవడం ఏమైనా గర్వకారణమా?

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే మళ్ళీ మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవడం కాదు. భావితరాలు కూడా మన పేరు చెప్పుకునేలా ఇలాంటి గొప్ప పనులు చేయాలి.

అమరావతితో సిఎం చంద్రబాబు నాయుడు పేరు, ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంతో పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేరు శాశ్వితంగా చరిత్రలో నిలిచిపోతాయి. మరి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి పేరు?

ADVERTISEMENT
Latest Stories