భూమా నాగిరెడ్డి మరణానికి ముందు అసలేం జరిగింది?

శనివారం నాడు తన ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి హాయిగా మాట్లాడి వెళ్ళిన భూమా నాగిరెడ్డి, ఆదివారం నాడు కన్నుమూయడం అనేది కుటుంబ సభ్యులకు, అభిమానులకు జీర్ణించుకోలేని విషయంగా మారింది. దీంతో అసలు భూమా మరణానికి ముందు ఏం జరిగింది? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఈ విషయాలపై భూమా బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి స్పందిస్తూ… అసలేం జరిగిందో వివరించారు.

ADVERTISEMENT

గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన భూమా నాగిరెడ్డి బ్రెయిన్ ఫంక్షనింగ్ అక్కడితోనే ఆగిపోయిందని, దీంతో చికిత్సకు స్పందించడం మానేసారని, అయినప్పటికీ వైద్యులు దాదాపుగా గంటన్నర్ర పాటు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపారు. ఇదే విషయాన్ని డాక్టర్లు కూడా ధృవీకరించారు. గతంలో రెండు సార్లు హార్ట్ ఎటాక్ ను ఎదుర్కొన్న భూమాకు బైపాస్ సర్జరీ కూడా జరిగిందని, ఈ సారి గుండెపోటు మరింత తీవ్రంగా వచ్చిందని, దీని వలనే పరిస్థితి చేయి దాటిపోయిందని డాక్టర్లు పేర్కొన్నారు.

2014 ఏప్రిల్ 24వ తేదీన తల్లి శోభానాగిరెడ్డిని కోల్పోయిన ముగ్గురు పిల్లలకు, ఇపుడు తండ్రి కూడా దూరం కావడం అత్యంత చింతించాల్సిన విషయంగా మారింది. అయితే భూమా కుటుంబానికి తాను అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే మరోసారి అఖిలప్రియతో ఫోన్ లో మాట్లాడి ఓదార్చారు. తెలుగుదేశం కుటుంబం ఓ వ్యక్తిని కోల్పోయిందని చంద్రబాబు సంతాపం తెలుపగా, హుటాహుటిన నారా లోకేష్ నంద్యాలకు బయలుదేరారు.

ADVERTISEMENT
Latest Stories