తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన విషయం బయటపడితే సిఎం చంద్రబాబు నాయుడు ఓ పధకం ప్రకారం తమకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయిస్తున్నారని జగన్, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు ఆరోపించేవారు. కానీ ఆ కేసులో పోలీసులు దర్యాప్తు జరిపి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీ నిర్వాహకులని అరెస్ట్ చేసేసరికి వైసీపీ నేతలు సైలంట్ అయిపోయారు.
కల్తీ నెయ్యి వ్యవహారంలో తమపై బురద జల్లుతున్నారని ఆరోపించిన భూమన కరుణాకర్ రెడ్డే ఇప్పుడు తిరుమల గోశాలలో గత మూడు నెలలుగా వందల కొద్దీ ఆవులు, దూడలు చనిపోతున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడో చనిపోయిన ఆవుల ఫోటోలు పెట్టి అవన్నీ తిరుమల గోశాలలో చనిపోయినవే అని దుష్ప్రచారం చేస్తున్నారు.
గత 5 ఏళ్ళ జగన్ పాలనలో తిరుమలలో ఎన్ని అపచారాలు, అవినీతి, అక్రమాలు జరిగాయో లెక్కలు తీస్తే చాలామందే జైలుకి వెళ్ళాల్సి వస్తుందని వైసీపీ నేతలకు కూడా తెలుసు. ఇటువంటి దుష్ప్రచారాలు చేసినా కేసులు నమోదవుతాయని తెలుసు.
కానీ భూమన కరుణాకర్ రెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ పరమ పవిత్రమైన తిరుమల గురించి ఈవిదంగా దుష్ప్రచారం చేస్తుండటం చాలా శోచనీయం. పైగా తిరుమల గోశాలలో ఆవులు చనిపోతుంటే సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ ఏం పీకుతున్నారని ఎద్దేవా చేయడం ఇంకా తప్పు.
భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఈ దుష్ప్రచారంపై టీటీడీ సభ్యుడు, బీజేపి నేత భాను ప్రకాష్ రెడ్డి ఖండించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు.
టీటీడీ గోశాలలో ఆవులకు ఆహారం, వైద్యం కొరత లేనేలేదు. కనుక ఆవులు చనిపోయే అవకాశమే లేదు. అందువల్లే ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన భక్తులు కూడా గోదానం చేస్తుంటారు. కానీ టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డే రాజకీయ దూరాలోచనతో ఈవిదంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయన వస్తే గోశాలలో ఆరోగ్యంగా ఉన్న ఆవులన్నిటినీ చూపిస్తాము,” అని అన్నారు.
పరమ పవిత్రమైన తిరుమల పేరుతో కూడా ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నందుకు సంజాయిషీలు, క్షమాపణలు కోరితే సరిపోదు. టీటీడీ, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తినే విదంగా నకిలీ ఫోటోలు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మరెవరూ టీటీడీ గురించి ఈవిదంగా దుష్ప్రచారం చేయకుండా ఉంటారు.




