బీజేపీ అధిష్టానం ఏపీలో ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీలన్నిటితోను చర్చల పేరుతో సమావేశాలు జరిపి ఎవరికీ ఒక నిర్దిష్ట హామీ ఇవ్వకుండా మైండ్ గేమ్ ఆడుతుంది. ఎన్డీయే లోకి కొత్త పార్టీలు వచ్చి చేరబోతున్నాయంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో అటు వైసీపీ ఊహాలోకంలో విహరిస్తుంటే..,మా పాత మిత్రులను మేము ఎప్పుడు ఎన్డీయే నుండి బయటకు పంపలేదు.
Also Read – వారి పాపాలకు క్షమార్హత ఉంటుందా.?
ఆయా రాష్ట్ర పరిస్థితుల రీత్యా ఆ పార్టీల అధినేతలే బయటకు వెళ్లారు. ఇప్పుడు మళ్ళీ పాత మిత్రుల కలయికతో ఎన్డీయే మరింతగా బలపడబోతున్నది అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో ఇటు టీడీపీ శ్రేణులు ఈసారి బీజేపీ టీడీపీ తో పొత్తుకు సిద్దమైనట్లే,ఇక 2014 ఎన్నికల కాంబోరే రెడీ అంటూ ఇక జగన్ ను ఎదుర్కోవడమే తరువాయి అన్నట్లుగా టీడీపీ శ్రేణులు ఉత్సాహంలో తెలియాడుతున్నారు.
ఇక అధికారికంగా పొత్తులో ఉన్న జనసేన కు మాత్రం మేము ఇప్పటికి జనసేన పార్టీతో పొత్తు కొనసాగిస్తున్నాం అంటూ చెపుతూ పవన్ రాజకీయంగా అడుగు ముందుకు వేయకుండా అడ్డుపడుతూ వస్తుంది బీజేపీ. టీడీపీ, జనసేన, వైసీపీ మూడు పార్టీలు తమతమ ఆఫర్లను బీజేపీ అధిష్ఠానము ముందు ఉంచిన తరుణంలో బీజేపీ పెద్దల చూపుని ఆకర్షించగల పార్టీ ఎదో, ఆ అధినేత ఎవరో తెలియక ఆ మూడు పార్టీల నేతలే కాదు రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు.
Also Read – వర్రాని వైసీపియే లేపేస్తుందేమో? బీటెక్ రవి
ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో బీజేపీ అధిష్టానం పొత్తుల పై ఒక నిర్ణయాన్ని ప్రకటించక పోవడంతో రాష్ట్ర స్థాయి నాయకత్వం ప్రజల్లోకి వెళ్లి ఏ పార్టీ పైవిమర్శలు చేయాలో, ఏ నాయకుడిని నిందించాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. పొత్తు ఒకరితో అనుకుంటే అధిష్టానం సహకారం మరొక పార్టీ పై ఉంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉనికి కోసం పోరాడుతున్న బీజేపీ మరింత దీనావస్థకి చేరే ప్రమాదం లేకపోలేదు.
ఈ పరిస్థితులన్నీ నిశితంగా పరీక్షిస్తున్న ఏపీ ప్రజలు మాత్రం బీజేపీ అధిష్టానం పొత్తు ఎవరితో పెట్టుకోవాలో..? సహకారం ఎవరికీ అందించాలో..? ఇంకా తేల్చుకోలేకపోతుంది అంటూ బీజేపీ వైఖరి పై మండిపడుతున్నారు. ఇలా తమ నిర్ణయాన్ని ఎటు తేల్చక టీడీపీ – జాన్సెన కూటమిని ముందుకు వెళ్లనీయకుండా చేసి ఒకరకంగా బీజేపీ ఇప్పటికే ఓ పార్టీకి అనధికార మద్దతు తెలియచేస్తుంది అంటూ రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. ఇప్పటికైనా బీజేపీ అధిష్టానం ఇటువంటి విశ్లేషణలకు చెక్ పెట్టి వాస్తవ పరిస్థితులకు ఉన్న అడ్డుతెర తీస్తారా..?