రజినీకాంత్ ను బీజేపీ రాజకీయాల్లోకి తెచ్చిందా?

BJP behind rajnikanth politicsసూపర్ స్టార్ రజినీకాంత్ కాసేపటి క్రితం తన రాజకీయ ఆరంగేట్రానికి సంబంధించిన ప్రకటన చేసారు. రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్‌ స్పష్టత ఇవ్వడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే రాజకీయాల్లో ఆయన పయనం ఎలా ఉండబోతుంది అనేదాని గురించి అంతటా చర్చ జరుగుతుంది.

చాలా మంది రజినీకాంత్ బీజేపీ మద్దతుగా రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారని అనుకుంటున్నారు. జయలలిత మరణానంతరం తమిళ నాడు మీద బీజేపీ కన్నేసింది. ఏఐడీఎంకే లో పళనిస్వామి, పనీర్ సెల్వం వర్గాన్ని చేతిలోకి తెచ్చుకుని రాజకీయం చెయ్యాలని చూసింది. అయితే ఇటీవలే జరిగిన ఉపఎన్నిక వారు తొక్కి పట్టి ఉంచాలని చూసిన దినకరన్ గెలవడంతో బీజేపీ ఖంగుతింది.

ADVERTISEMENT

పైగా ఆ ఎన్నికలలో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు రావడంతో షాక్ కు గురయ్యింది. దీనితో మరోసారి రజినీకాంత్ ద్వారా రాజకీయం చెయ్యడానికి ఆయనని తెరమీదకు తెచ్చిందని అనుకుంటున్నారు. ఆరెస్సెస్ కు చెందిన గురుమూర్తి బీజేపీకి రజినీకాంత్ కు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories