ఢిల్లీలోని అమిత్ షా గృహంలో రేపు జరిగే కీలక సమావేశనికి రావాలని ఏపీ, తెలంగాణ బీజేపీ నాయకులకు పిలుపు అందింది. దీంతో తెలంగాణ నుంచి లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఏపీ నుంచి హరిబాబు, విష్ణుకుమార్ రాజు ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాలకు సంబందించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై అమిత్ షా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే విశాఖ రైల్వే జోన్, హైకోర్టు విభజన అంశాలపై కూడా కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అసెంబ్లీ స్థానాల పెంపుపై తొలుత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.
ఈ సమావేశం నిర్వహించిన అనంతరం అటు టీడీపీ, ఇటు టీఆర్ఎస్ నేతలతో కూడా అమిత్ షా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. ఇదే సమావేశంలో ఏపీలో పొత్తులపై, ఇటీవలే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కూడా వారి వివరణ అడగబోతున్నారని సమాచారం.



