ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం వైఖరిపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ సభలో సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సమర్ధించారు. తాను మొదట ఆంధ్రుడునని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకొనేందుకు సిద్ధంగా లేమని అన్నారు.
[m9ad]
చంద్రబాబు చెప్పిన విషయాలను అర్థం చేసుకున్నామని, ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామని తాము అనడంలేదని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. దీనితో బీజేపీ నేతలు కంగుతిన్నారట. ఈ విషయం అమిత్ షా వరకు వెళ్లినట్టు సమాచారం. అసలు ఆయన బీజేపీ నేతా టీడీపీ నేతా అని మండిపడినట్టు సమాచారం.
సొంత పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి మీరు ఎలా మద్దత్తు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసారట. ఆయన ఇలా చేస్తుంటే ఇంకో ఎమ్మెల్యే మాజీ మంత్రి మాణిక్యాలరావు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారట. అయితే విష్ణుకుమార్ రాజు బీజేపీ శాసనసభాపక్ష నేత కావడంతో ఆయనకే ఎక్కువగా మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నట్టు బీజేపీ నేతలు చెప్పుకొచ్చారట.



