రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రత్యేక హోదాపై టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత సోము వీర్రాజు మరోసారి టీడీపీపై విమర్శలు చేసారు. హోదా రాకపోతే నష్టం 3వేల కోట్లేనని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇది మేం నమ్మి ప్రత్యేక ప్యాకేజీతో సర్దుకుపోయాం అని చెప్పుకొచ్చారు.
వివిధ సందర్భాల్లో ప్రత్యేక హోదాపై చంద్రబాబు చేసిన ప్రకటనలు సోము వీర్రాజు మీడియాకు బహిర్గతం చేశారు. ప్రత్యేక హోదా అంటే జైలుకే అని చంద్రబాబు అన్న పేపర్ క్లిప్పింగ్, హోదాతో ఒరిగేదేం లేదని, మనమే ఎక్కువ సాధించాంమని, ఏ రాష్ట్రానికైనా ఎక్కువ వచ్చాయా అని చంద్రబాబు అని అన్నట్టుగా మరో క్లిప్పింగు చూపించారు.
నిజమే రెండు చంద్రబాబు అన్నవే, కాకపోతే వాటిని తెలివిగా తమకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వారు. ప్రత్యేక హోదా అంటే జైలుకే అని చంద్రబాబు అనలేదు. వీధిపోరాటాలకు దిగితే జైలుకు వెళ్తారని విద్యార్థులను బాధ్యతగా హెచ్చరించారు. హోదా కంటే ఎక్కువ సాధించాం అని చెప్పిందీ నిజమే.
ఆ ప్రకటన ప్రత్యేక ప్యాకేజీని నమ్మి చేసింది. అయితే ప్రత్యేక ప్యాకేజీని అమలు చెయ్యకుండా మోసం చేసింది బీజేపీ కాదా? ప్రత్యేక హోదాకు బదులుగా ఇస్తామని చెప్పిన ఈఏపీ ప్రాజెక్టులను ఒకే చెయ్యకుండా ఆంధ్రప్రదేశ్ ను మోసం చేసింది కేంద్రం కాదా. చంద్రబాబు సాంక్షన్ చేసినవాటి గురించి ఎక్కువ సాధించాం అన్నారు. దానిని వారికి అనుకూలంగా మార్చి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు బీజేపీ వారు.



