నేనూ వస్తున్నా… అంటున్న వైసీపీ బొబ్బిలి ఎమ్మెల్యే..!

sujay-krishna-ranga-rao-joining-TDPsujay-krishna-ranga-rao-joining-TDPవైఎస్ జగన్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. తాజాగా వైసీపీకి చెందిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపిన రంగారావు, తాను కూడా చేరుతానని తెలిపినట్లు సమాచారం.

ADVERTISEMENT

త్వరలోనే తాను కూడా వైకాపా సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలోకి వస్తానని, తనతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు సైతం పార్టీ మారతారని స్థానిక నేతలకు సమాచారం అందించారట. ఇప్పటికే 11 మంది వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరి, ఆ పార్టీని కష్టాల్లోకి నెట్టేయగా, తాజా ఫిరాయింపుల వార్తలతో ఆ పార్టీ పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లినట్లయింది. జరుగుతున్న పరిణామాలతో త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో సైతం వైకాపాకు ఒక సీటును గెలుచుకునే అవకాశాలు చెల్లాచెదురు అవుతున్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ADVERTISEMENT
Latest Stories