ఆంక్షలు, నిబంధనల నడుమ వైసీపీ ప్రభుత్వం రాష్టాన్ని నడుపుతుంది అంటూ ప్రతిపక్ష పార్టీలు గగ్గోలుపెడుతున్నాయి.తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుండి బెయిలు మీద విడుదలై తన స్వస్థలానికి చేరుకునే సమయంలో మార్గమంతా ఆ పార్టీ కార్యకర్తలతో, బాబు అభిమానులతో కోలాహలంగా మారింది.
బాబు తిరిగి ప్రజల మధ్యకు రావడంతో ఆపార్టీ నేతలు స్వీట్లు పంచుకుంటూ బాబు చిత్ర పటానికి పాలాభిషేకాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.నెల్లూరు జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తదితరులు కూడా టీడీపీ జెండాలతో, ఆపార్టీ కార్యకర్తలతో కలిసి వేడుక నిర్వహించుకుంటుంటే జలదంకి ఎస్ఐ ఆదిలక్ష్మి వారిని వారించి ఇక్కడితో ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని, ఇందుకు అనుమతులు తీసుకున్నారా మీరు, ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించే ఏ కార్యక్రమానికి తాము అనుమతించం అంటూ టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు.
టీడీపీ నాయకులు కూడా వెనకడుగు వేసే ప్రశ్నే లేదన్నట్టు ఆమెతో ఎదురుదాడికి దిగారు. వైకాపా నాయకుల ర్యాలీలకు అనుమతి ఇచ్చిన మీరు టీడీపీ కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటారు. వారికి లేని ఆంక్షలు తమకెలా వర్తిస్తాయి కాస్త వివరించాలంటూ రామారావు సదరు అధికారిని సూటిగా ప్రశ్నించారు. దానికి అసలు మెరెవ్వరూ నన్నడగడానికి? అంటూ, అనుమతి ఇవ్వాలో లేదో మీరు నాకు చెపుతారా? అంటూ రెచ్చిపోయారు. ఇప్పుడు ఈ వీడియో సామజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.
అసలు ఏపీలో అధికారుల అనుమతులు ఎవరికీ దొరుకుతాయి? దేనికి దక్కుతాయి? అనే ప్రశ్న ఊపందుకుంది.ఈ రాష్ట్రము నుండి అక్రమంగా కొన్ని వేల కోట్ల గంజాయి రవాణాకు జరుగుతుంది. అలాగే కొన్ని వేల టన్నుల ఇసుక ఇక్కడ నుండి అక్రమంగా పక్క రాష్ట్రాలకు ఎలా వెళుతుంది? ఏంతో విలువైన ఎర్రచందనం ఎలా అక్రమ మార్గాలలో బయటకు వెళుతుంది?
కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యం యథేచ్ఛగా ఎలా తరలిపోతోంది? విచ్చలవిడిగా రాష్ట్రంలో డ్రగ్స్ దందా ఎలా జరుగుతుంది? వీటన్నిటికీ అధికారుల అనుమతులు దొరుకుతున్నాయా?లేకా ఇటువంటి కార్యక్రమాలకే ఏపీలో అనుమతి దొరుకుతుందా?తమ అధినేతకు మద్దతుగా ర్యాలీలు చేయడానికి, సంఘభవం తెలపడనికి, మా ఆనందాన్ని పంచుకోవడానికి మాత్రం అధికారుల అనుమతులు కావాలా?
అధికార పార్టీ నేతలకు లేని ఆంక్షలు ప్రతిపక్ష పార్టీలకు కలిపిస్తారా? ప్రతిపక్ష పార్టీలు సభలు నిర్వహించాలన్నా, సమావేశాలు చేపట్టాలన్నా, చివరకు తమ పార్టీ కార్యక్రమాలు చేసుకోవడానికి రాష్ట్రానికి రావాలన్నా ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు నిబంధనలు, ఆంక్షలు గుర్తువస్తాయా?ఇదేనా మీ నిజాయితీ, నిబద్ధతా అంటూ ప్రజాస్వామ్య వాదులు ప్రభుత్వాన్ని వారికి కొమ్ముకాసే అధికారులని ప్రశ్నిస్తున్నారు.




