టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి ఎదగాలి అంటే సినిమా మేకింగ్ లో తనదైన ప్రతిభను చూపిస్తే చాలు..అయితే ఇప్పుడు ఆ అవకాశమే వరంగా మారింది ఆ కుర్ర దర్శకుడికి. ఇంతకీ ఎవరు ఆ దర్శకుడు ఏంటి ఆ కధ అంటే ఇండియన్ సినిమాలోనే తొలిసారిగా సబ్ మరైన్ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన సినిమా “ఘాజీ”తో భారీ హిట్ అందుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. అయితే ఆ సినిమా అటు కలెక్షన్స్ పరంగానూ, ఇటు అవార్డ్స్ పరంగా గాను మంచి ఫలితాలే తెచ్చి పెట్టింది.
[m9ad]
ఇక ఆ తర్వాత వరుణ్ తేజ హీరోగా అంతరిక్షంతో ప్రజలను మరోసారి ఆకట్టుకోవడానికి వస్తున్నాడు ఈ యువ దర్శకుడు. కట్ చేస్తే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు లభించడం, మరో పక్క రెండో సినిమా కూడా సరికొత్త కధ అయిన అంతరిక్షం ను ఎంచుకోవడం ను చూసిన బాలీవుడ్ బడా సినిమా నిర్మాతలు సంకల్ప్ రెడ్డితో సినిమా తియ్యడానికి ఇప్పటికే అగ్రీమెంట్స్ చేయించుకున్నట్లు సమాచారం. సినిమా వర్గాల నుంచి వినిపిస్తున్న కధన ప్రకారం సంకల్ప్ రెడ్డి ఇప్పటికే రెండు బాలీవుడ్ బడా బ్యానర్స్ కి సినిమా చెయ్యడానికి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా టాలెంట్ ఉన్న టెక్నీషియన్ ని ఎవ్వరూ వదులుకోరు అని, ప్రతిభ ఉండాలే కానీ, అవకాశాలకు కొదవ ఉండదు అని సంకల్ప్ రెడ్డి మరోమారు రుజువు చేశాడు అని చెప్పవచ్చు, మరి మన తెలుగు యువ దర్శకుడు బాలీవుడ్ ను ఎలా ఏలతాడో చూద్దాం.



