ఇద్దరి వారసులు ఒకేసారి ఎంట్రీ.. కానీ ఒక్కరే విజేత!

Botsa Anusha and Siri Sahasra ZPTC Results

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు విజయనగరం జిల్లాలో వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా చేసినప్పుడు చాలా కలకలం ఏర్పడింది. ఎందుకంటే, ఆయనే బొత్స సత్యనారాయణకు రైట్ హ్యాండ్‌. ఆయన తరపున జిల్లాలో పార్టీ కార్యక్రమాలన్నీ చక్కబెట్టేవారు.

దీంతో మొదట బొత్స సత్యనారాయణ కూడా షాక్ అయినప్పటికీ త్వరగానే తేరుకొని నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ముందుగా తన కుమార్తె అనూషను రాజకీయ వారసురాలుగా పరిచయం చేసి, ఆమెకు భీమిలి వైసీపీ ఇన్‌ఛార్జ్‌ పదవి దక్కేలా చేశారు.

ADVERTISEMENT

ఆ తర్వాత జిల్లాలో బొండపల్లి నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో దింపారు. కానీ ఆమె టీడీపీ అభ్యర్థి పాశాల నీరజ చేతిలో ఓడిపోయారు.

ఇదే సమయంలో చిన్న శ్రీను కూడా తన కుమార్తె సిరి సహస్రను తన రాజకీయ వారసురాలిగా పరిచయం చేసి జిల్లాలోని తెర్లాం నుంచి టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో దింపారు. ఆమె విజయం సాధించారు.

బంధువులైన బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీనుల రాజకీయ మహిళా వారసులు ఒకేసారి రాజకీయ ఆరంగ్రేటం చేస్తే వారిలో చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర తొలి విజయం సాధించగా, అనూషకు తొలి ప్రయత్నంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

అయితే రాజకీయాలలో ఎదిగేందుకు ఈ విజయం, అపజయం రెండూ కూడా మొదటి మెట్లే. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. అదే ఈ ఎన్నికల్లో విజయం సాధించింది.

కనుక చిన్న శ్రీను రాజకీయ వారసురాలు సిరి సహస్ర త్వరగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో, గ్రామస్థాయిలో వైసీపీ పునాదులు దెబ్బ తిన్నాయి.

కనుక బొత్స కుటుంబం కూడా టైటానిక్ షిప్‌లో నుంచి దిగిపోయి, విజయసాయిరెడ్డి తెస్తున్న కొత్త షిప్ ఎక్కుతుందేమో?

ADVERTISEMENT
Latest Stories