పెద్ద హీరోల వేదికలపై ఇతర హీరోల సినిమాల గురించి ప్రస్తావించడం బహు అరుదుగా జరిగే విషయం. కానీ అప్పుడప్పుడు ఇది జరుగుతా ఉంటుంది. తాజాగా నందమూరి బాలకృష్ణ “జై సింహా” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ పరోక్షంగా “అజ్ఞాతవాసి” గురించి ప్రస్తావించడం ఆశ్చర్యాన్ని గురిచేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న బోయపాటి… “ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న మన సినిమాలతో పాటు ఆ సినిమాలు కూడా బాగా ఆడాలని, తెలుగు సినీ పరిశ్రమ తలెత్తుకునేలా ఉండాలని కోరుకుంటున్నానని” పరోక్షంగా పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” సినిమా గురించి ప్రస్తావించారు.
ఈ సందర్భంగా నందమూరి అభిమానులకు కూడా ఓ తీపి కబురును తెలిపారు. ‘జై సింహా’ చిత్ర ప్రధాన తారాగణం గురించి మాట్లాడిన బోయపాటి, ‘నేను బాలయ్య గురించి మాట్లాడను, చేసి చూపిస్తాను, ఎందుకంటే అతి త్వరలోనే నేను బాలయ్యతో సినిమా చేయబోతున్నాను కదా’ అంటూ చెప్పడంతో ఫ్యాన్స్ విజిల్స్ తో ఆడిటోరియంను మోత మోగించారు. ‘సింహా, లెజెండ్’ వంటి రెండు బ్లాక్ బస్టర్ విజయాలను బాలయ్యకు అందించిన ఖ్యాతి బోయపాటి సొంతం. ఈ కాంభినేషన్ కోసం నందమూరి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



