ఏటేటా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. కానీ ఈ ఏటా మాత్రం వాటికి తోడు మహేష్ “బ్రహ్మోత్సవం” కూడా తోడు కానుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రిన్స్ సరసన సమంత, కాజల్, ప్రణితలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొదటిసారిగా మహేష్ బాబు సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఒక బ్రహ్మోత్సవ వేడుకలా ఉండబోతుందని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఇప్పటికే స్పష్టం చేసారు.
దీంతో ప్రిన్స్ “బ్రహ్మోత్సవం” కోసం అభిమానులు వేయి కళ్ళతో చూసిన వేళ… సోషల్ మీడియాలో వివిధ తేదీలు హల్చల్ చేసాయి. అయితే వాటన్నింటిని తెరదించుతూ ‘ఇండస్ట్రీ హిట్’ అధినేత బిఏ రాజు ‘బ్రహ్మోత్సవం’ తేదీలను ఖరారు చేసారు. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగనున్న మిక్కీ జే మేయర్ పాటల పండుగకు మే 6వ తేదీన ముహూర్తాన్ని ఖరారు చేసుకోగా, సినిమాను మే 20వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకతిచారు. దీంతో ప్రస్తుతం అందరి చూపులు ప్రిన్స్ ‘బ్రహ్మోత్సవం’పైనే…!



