స్మార్ట్ గ్రామాల పధకానికి ‘బ్రాండ్ అంబాసిడర్లు’

brand-ambassadors-for-smart-villagesస్మార్ట్ సిటీల క్రమంలో గ్రామాలు, వార్డులను తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ‘స్మార్ట్ గ్రామాలు, వార్డులు’ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గ్రామాలు, వార్డులలో పలు కార్యక్రమాలు చేపట్టేందుకు, ఈ పథకం మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు జిల్లాల వారీగా బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆ బాధ్యతలను ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వాణిజ్య వేత్తలైన రతన్ టాటా, ఆనంద్ మహీంద్ర, విప్రో ప్రేమ్ జీలకు అప్పగించాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు. స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీరు పలు కార్యక్రమాలు చేపడతారు. గ్రామాలను దత్తత తీసుకున్న వారిని సమన్వయం చేసుకొంటూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేలా చూస్తారు.

ADVERTISEMENT

ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాకు – జీఎంఆర్ గ్రూప్ అథినేత గ్రంథి మల్లికార్జునరావు, విశాఖపట్నం -‘దివి’ మురళీ, తూర్పుగోదావరి – ఎన్ సీసీ రాజు, కృష్ణాజిల్లా – ‘నవయుగ’ విశ్వేశ్వరరావు, చిత్తూరు – గల్లా రామచంద్ర నాయుడు, గుంటూరు – బొమ్మిడాల శ్రీనివాస్, నెల్లూరు జిల్లా – డాక్టర్ రెడ్డీస్ ప్రసాద్ రెడ్డిలను బ్రాండ్ అంబాసిడర్ నియమించనున్నారని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories