ప్రాంతీయ రాజకీయం నుంచి జాతీయ రాజకీయానికి చేరుకోవాలని అనే ఆశతో పార్టీ పేరును సైతం తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) నుంచి భారతీయ రాష్ట్ర సమితి (BRS) గా మార్చుకున్న కేసీఆర్ చివరికి తెలంగాణ ప్రజలకు దూరమయ్యారు, అలాగే తెలంగాణ రాజకీయానికి చట్టమయ్యారు.
అయితే నాడు వద్దనుకుని వదులుకున్న TRS నేడు బిఆర్ఎస్ కు ఉరితాడయ్యిందా.? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవువనే సమాధానమే వస్తుంది. ఇటు అధికార కాంగ్రెస్ కి అటు ప్రతిపక్ష బిఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలవబోతున్న నువ్వా – నేనా అనే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోరులో బిఆర్ఎస్ ఓటమికి తెరాస గండికొట్టబోతుందా.?
అవును బిఆర్ఎస్ ఓటింగ్ ని తెరాస ప్రభావితం చేయబోతుంది. అసలు విషయానికొస్తే, నవంబర్ 11 న జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల బరిలో గెలిచేందుకు బిఆర్ఎస్ కాంగ్రెస్ పై యుద్దానికి సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో ఈ ఉపఎన్నికలలో తన సత్తా చాటటానికి, బిఆర్ఎస్ బలాన్ని తగ్గించడానికి తెరాస బరిలోకి దిగుతుంది.
తెరాస యే బిఆర్ఎస్ గా మారింది కదా..మళ్ళీ బిఆర్ఎస్ కి తెరాస పోటీ ఏంటి అనుకుంటున్నారా.? అవును కేసీఆర్ వడ్డునకుని వదిలేసిన ‘తెరాస’ పేరును “తెలంగాణ రక్షణ సమితి” పేరుతో ఉపఎన్నికల బరిలో దింపుతున్నారు బిఆర్ఎస్ ప్రత్యర్థి వర్గం.
కేసీఆర్ పార్టీ గులాబీ రంగుని పోలిన రంగుతోనే, బిఆర్ఎస్ జెండాను పోలిన జెండాతోనే తెరాస, బిఆర్ఎస్ కు ప్రత్యర్థిగా బరిలో దిగనుంది. దీనితో బిఆర్ఎస్ క్యాడర్ లో ఓటమి భయం ఆందోళనను కలిగిస్తుంది. రెండు పార్టీల రంగు, జెండా, గుర్తు అన్ని ఒకేలా ఉండడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు.
ఇది బిఆర్ఎస్ ఓటింగ్ ను ప్రభావితం చేస్తుంది, బిఆర్ఎస్ గెలుపును డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది అంటున్నారు బిఆర్ఎస్ శ్రేణులు. అధికార కాంగ్రేస్ ఈ ఉపఎన్నికలలో గెలిచి తన ప్రభుత్వ పరువు నిలబెట్టుకోవడానికే ఇటువంటి కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారంటూ ఆరోపిస్తున్నారు బిఆర్ఎస్ క్యాడర్.
మరి ఈ తెరాస ఆ బిఆర్ఎస్ ను ఏమాత్రం కట్టడి చేయగలుగుతుందో.? అలాగే తెలంగాణ ప్రజలలో తెరాస పేరు పట్ల ఇంకా ఎంత ప్రేమ దాగి ఉంది అనేది ఈ ఉపఎన్నికలలో బిఆర్ఎస్ కు ముఖ్యంగా కేసీఆర్ కి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే “బిఆర్ఎస్ కు పోటీగా తెరాస” ఈ ఒక్క వాక్యమే బిఆర్ఎస్ ప్రత్యర్థి వర్గాలకు మంచి కిక్కిస్తుంది.







