
నవంబర్, 6, 2017 న వైస్ రాజశేఖర్ రెడ్డి స్వస్థలం అయిన కడప జిల్లాలోని ఇడుపులపాయ గ్రామం నుంచి వైస్ జగన్ మోహన్ రెడ్డి తన మొదటి పాదయాత్రను ప్రారంభించి దాదాపు 3600 కీ.మీ ల సుదీర్ఘ ప్రయాణం చేసారు.
Also Read – కేటీఆర్ కు హరీష్ మద్దతు దక్కినట్టేనా.?
ఇడుపులపాయలో మొదలైన జగన్ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల గుండా సాగుతూ చివరికి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగిసింది. అయితే నాటి జగన్ పాదయాత్రలో వైసీపీ పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా తల్లి విజయలక్ష్మిని, చెల్లి షర్మిలను వెంటబెట్టుకుని ‘ఒక్క ఛాన్స్’ అంటూ ప్రజల ముందుకెళ్లారు.
తన ముఖ్యమంత్రి పదవి కోసం 341 రోజుల పాటు పాదయాత్రను కొనసాగించిన జగన్ 2019, జనవరి, 9 న ఆ యాత్రకు ఎండ్ కార్డు వేశారు. అయితే నాడు జగన్ తన పాదయాత్రతో సాధారణ ప్రజలను కలుసుకోవడం, వారికి ముద్దులు పెట్టడం, హగ్గులు ఇవ్వడం, తల మీద చేయి పెట్టి దీవించడం, పార్టీ క్యాడర్ కు సెల్ఫీలు ఇవ్వడం ఇలా అనేకాకనేక కార్యక్రమాలు చేసి ప్రజలను మెప్పించగలిగారు, తన ఒక్క ఛాన్స్ కల తీర్చుకోగలిగారు.
Also Read – వైసీపీ..బిఆర్ఎస్ ఇద్దరిది అరెస్టుల రాజకీయమేనా.?
అయితే తాజాగా 2024 వైసీపీ ఓటమితో వైస్ జగన్ తన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటి వరకు మీరంతా కేవలం జగన్ ను మాత్రమే చూసారు, ఇక నుంచి జగన్ 2 .0 ని చూడబోతున్నారు, నా కాళ్ళల్లో తిరిగి పాదయాత్ర చేసే సత్తువ ఉంది, తద్వారా పార్టీని మరల అధికారంలో తీసుకురాగలను, అప్పటి వరకు కళ్ళు మూసుకుని రోజులు లెక్కపెట్టుకోండి చాలు అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
దీని ప్రకారం రాబోయే 2027 లో జగన్ మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు, వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురానున్నారు అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఇప్పటి నుంచే తెగ హడావుడి చేసేస్తున్నారు.
Also Read – వైసీపీ రాజకీయాలు మారాయి… మరి టీడీపీ?
అయితే నాడు జగన్ 1.0 పాదయాత్రలో కనిపించిన వారికల్లా ముద్దులు పెట్టి హగ్గులిచ్చి ఆశీర్వదించిన జగన్ ఇప్పుడు 2.0 లో అంతకు మించి చేస్తారా అంటూ వైసీపీ వ్యతిరేఖ వర్గం వైసీపీ కి కౌంటర్లు వేస్తుంది. ఏదెలా ఉన్నప్పటికీ 2017 నాటి పరిస్థితులు నేడు ఆంధ్రప్రదేశ్ లో కానీ వైసీపీ లో కానీ ఇప్పుడు కనిపించడం లేదు.
నాడు వైస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అడ్డుపెట్టుకుని జగన్ లక్ష కోట్ల అవినీతి చేసారు అంటూ ఆరోపణలు వచ్చినప్పటికీ, తండ్రి వైస్సార్ రాజకీయ వారసత్వ ఛరిష్మా, తల్లి, చెల్లి సింపతీ అస్త్రాలు, గుండె పోటు…గొడ్డలి వేటు కథనాలు వైసీపీ కి ఒక్క ఛాన్స్ అవకాశాన్ని అందించాయి.
కానీ ఆ ఒక్క ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను ప్రశ్నార్దకంలోకి నెట్టివేయడంతో పాటుగా, ఏపీ ని ఆర్థికంగా పాతాళానికి నెట్టేసింది. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ కక్ష్యా రాజకీయాలను కళ్లారా చూసిన ప్రజలు, ఆ పార్టీ నాయకుల బూతు ప్రవచనాలు చెవులారా విన్న ఓటర్లు వైసీపీ ని 151 నుంచి 11 కి కుందించి కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసారు.
ఈ తరుణంలో జగన్ 2.0 వైసీపీ కి రెండో ఛాన్స్ తీసుకురాగలుగుతుందా.? ఇప్పటికే తల్లి, చెల్లి తో పాటుగా వైస్ కుటుంబానికి వీరవిధేయులుగా చెప్పుకునే నాయకులందరూ కూడా వైసీపీ కి గుడ్ బై చెప్పి జగన్ ను తమ నాయకుడిగా తిరస్కరించారు. ఇక గత ఐదేళ్ల వైసీపీ పాపాలు కేసుల రూపంలో ఒక్కో వైసీపీ నాయకుడిని నీడలా వెంటాడుతూ జైళ్ల బాట పట్టిస్తున్నాయి.
అలాగే జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం తాలూకా అవకతవకలన్నీ కూడా తాడేపల్లి ప్యాలస్ వైపు కే వెళుతున్నాయి. ఇక సాక్ష్యాలన్నీ కూడా భారతి సిమెంట్ కంపెనీ వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. వాటన్నిటిని తప్పించి, ప్రజల కళ్ళు కప్పి వైస్ జగన్ 2.౦ పాదయాత్ర వైసీపీ కి భవిష్యత్ ను ఇవ్వగలదా.?