ఆంధ్రకు న్యాయం చెయ్యమనందుకు చంద్రబాబుపై సీబీఐను ఉసిగొలుపుతారంట

CBI enquiry on Chandrababu Naidu రాష్ట్ర బీజేపీ నాయకులు తెలుగు దేశం ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబు కేంద్రంపై పోరాటం చెయ్యడం జీర్ణించుకోలేని వారు పోలవరం ప్రాజెక్టు నిధులు అవకతవకలకు సంబందించి సిబిఐ విచారణ చేయడానికి గాను ప్రధాని మోడీ ప్రాతిపదిక తయారు చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు.

ADVERTISEMENT

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుకు సంబందించిన అన్ని వివరాలు కూడా మోడీ తెప్పించుకుంటున్నారని ,ఆయన సిబిఐ విచారణకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని మిత్రపక్షాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో ముడుపులు,టిడిపి నేతలకు ఎలా దక్కాయన్నదానిపై ఆరా తీస్తున్నారని అంటున్నారు.

ఒక వేళ నిజంగా అవినీతి జరిగినట్టు అయితే ఇప్పటిదాకా కేంద్రం ఏం చేస్తునట్టు? సొంతవారు అవినీతి చేసినా పర్లేదు… బీజేపీతో విభేదిస్తే మాత్రం సీబీఐ మీ ఇంటికి వస్తుందని చెప్పకనే చెబుతున్నారా? ఒకప్పుడు వారు కాంగ్రెస్ పై ఇటువంటి ఆరోపణలే చేసే వారు, ఇప్పుడు కాంగ్రెస్ కి బీజేపీకి తేడా లేదని అనుకోవాలా?

మరోవైపు బీజేపీవి తాటాకు చప్పుళ్లే అని టీడీపీ నాయకులు అంటున్నారు. “పోలవరానికి గంపగుత్తుగా నిధులు ఏమి ఇవ్వలేదు. పనులు అయ్యాక బిల్లులు చూసి ఇస్తున్నారు. ఇప్పటికి చాలా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రతి బిల్లును క్షుణ్ణంగా పరిశీలించే నిధులు విడుదల చేసారు. ఆంధ్రప్రజల కోసం ఎక్కడిదాకా ఐన వెళతాం… ఇటువంటివి పట్టించుకోము,” అని ఒక టీడీపీ సీనియర్ నాయకుడు తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories