వివేకా హత్య కేసు ముగింపు దొరికేనా.?

CBI Issues Notices in Viveka Murder Case After 7 Years

2019 ఎన్నికల ముందు జరిగిన వైస్ వివేకానంద రెడ్డి హత్య ఏపీ రాజకీయ రంగు మార్చింది. ఈ దారుణ హత్య తో 2019 ఎన్నికలలో వైసీపీ చాలావరకు రాజకీయ లబ్ది పొందింది. పులివెందులలో జరిగిన ఈ గొడ్డలి పోటు నారా వారి రక్త చరిత్ర అంటూ ప్రచారం చేసిన వైసీపీ నేరం టీడీపీ మీద నెట్టింది.

అయితే ఈ వివేకా హత్య రక్తపు మరకలు నారా వారిది కాదు వైస్ కుటుంబానిదే, ఇందులో టీడీపీ హస్తం లేదు వైసీపీ ప్రమేయమే ఉంది అంటూ వైస్ వివేకా కూతురు సునీతా నాటి నుంచి నేటి వరకు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

అయితే ఇందులో న్యాయం ఎవరి వైపు ఉన్నా ఆ హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకులు మాత్రం ఎప్పుడు సేఫ్ జోన్ లోనే ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ అధికారం వైస్ అవినాష్ ని గట్టునపడేసింది అనుకుంటే,

కూటమి అధికారంలోకి వచ్చాకా బీజేపీ తో వైసీపీ కి ఉన్న తెరచాటు స్నేహ బంధం వైస్ అవినాష్ ను కాపాడుతుంది అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బహిరంగ చర్చలే జరుగుతున్నాయి. వివేకా హత్య జరిగి దాదాపు 7 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కేసు ఒక దరికి చేరలేదు.

ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక మాజీ ముఖ్యమంత్రి బాబాయ్ ఇలా వివేకా వెనుక పెద్ద రాజకీయ చరిత్రే ఉన్నప్పటికీ ఆయన కుటుంబం మాత్రం వివేకా హత్య కు న్యాయం కావాలి అంటూ ఇప్పటికి రోదిస్తూనే ఉన్నారు.

అయితే ఇన్నాళ్లుగా పరిష్కారం కానీ కేసు ఇక ఏమవుతుందిలే అనుకున్న వేళ ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న పలువురికి సిబిఐ కోర్ట్ నోటీసులు జారీ చేసింది. అసలు విషయానికొస్తే, తెరమరుగైన వివేకా కేసు అధ్యాయాన్ని తిరిగి ప్రారభించాలని అంటూ సునీత నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు.

ఈ కేసులో తుది విచారణ ఇంకా పూర్తి కాలేదని, ఇందులో తెలుసుకోవాల్సిన అసలు వాస్తవాలు ఇంకా మిగిలే ఉన్నాయంటూ సునీతా తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనితో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దస్తగిరి, కడప ఎంపీ అవినాష్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ,సునీల్ యాదవ్, గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ తదితరులకు సీబీఐ కోర్ట్ నోటీసులు జారీ చేసింది.

అయితే కనీసం ఇప్పటికైనా కేసును తుది వరకు విచారించి వివేకా గొడ్డలి వేటు వెనుక ఉన్న అసలు వాస్తవాలు బయట పెట్టాలని, దాని వెనుక ఉన్న సూత్రధారులను, పాత్రధారులను శిక్షించాలి అంటూ వైఎస్ కుటుంబ అభిమానులు కోరుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories