కాక్రోచ్ లు ‘చావులు’ కోరుకుంటాయా.? జెన్ జీ – ఆల్ఫా లు ‘ వినాశాన్ని’ ప్రోత్సహిస్తారా.?

YS Jagan Mohan Reddy speaking at a press conference while criticizing Chandrababu Naidu and discussing Andhra Pradesh politics

జగన్ ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఆ సమయంలో సింహ భాగం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద రాజకీయ విమర్శలు చేయడానికి, ఆయన ను వ్యక్తిగతంగా టార్గెట్ చెయ్యడానికే కేటాయిస్తున్నారు.

మరీ ముఖ్యంగా బాబు చావు మీద పదేపదే జగన్ చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ లో పతనమవుతున్న రాజకీయ విలువలకు అద్దం పడుతున్నాయి. జగన్ ఈ వ్యాఖ్యల వెనుక ఎవరి బీపీలు పెంచాలని ఆశిస్తున్నారు.? ఎవరిని రెచ్చకొట్టాలని భావిస్తున్నారు.

ADVERTISEMENT

డిఎస్సి లో అవకతవకలు అంటూ మొదలు పెట్టిన జగన్ ప్రెస్ మీట్ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మావిగన్ దగ్గరకొచ్చి బాబు చావు ఆగింది. రాష్ట్ర రాజధానిగా తానూ ప్రతిపాదించిన మావిగన్ పేరు వింటే చాలు బాబుకి నరాలు తెగిపోయేంత బీపీ వస్తుందని,

ఒక్కోసారి ఆ బీపీ చూసి బాబు పోతాడేమో అని తనకే భయమేస్తుందని, ఒకవేళ ఎవరైనా బాబు నిద్రలో ఉన్నప్పుడు మావిగన్ అంటే టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో అని ఒకోసారి భయమేస్తుంది అంటూ జగన్ బాబు చావు మీద రాజకీయం చేస్తున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్లో మేము కాక్రోచ్లమే అంటున్న జగన్ కాక్రోచ్ లు మరొకరి చావును కోరుకుంటాయా.? కాక్రోచ్ లు వేరొకరి చావు మీద పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తాయా.? అనేదానికి సమాధానం చెప్పాలి. చావు నుంచి తప్పించుకోవడం కాక్రోచ్ లక్షణం కానీ వేరొకరిని చంపడం కానీ వేరొకరి చావుని కోరుకోవడం కానీ కాక్రోచ్ లక్షణం కాదు అనేది జెన్ జీ లకు తెలియదా.?

జెన్ జీ లు, ఆల్ఫా లు ఉన్న నేటి తరం సమాజంలో జగన్ చేస్తున్న ఈ తరహా రాజకీయం 2024 లో వైసీపీ ని 151 నుంచి 11 కి తెచ్చింది. ఇప్పటికి వైసీపీ అదే ధోరణితో ముందుకెళుతూ జగన్ 2.0, వైసీపీ 2.0 అంటూ రప్ప రప్ప నినాదాలు చేస్తుంటే దాని తాలూకా ఫలితాల భారాన్ని భుజాన మోయడానికి జగన్ చెపుతున్న జెన్ జీ లు, ఆల్ఫాలు సిద్ధంగా ఉంటారా.?

దేశంలో మరే రాష్ట్ర విపక్ష పార్టీ చేయని విధంగా వైసీపీ రాష్ట్రంలో విధ్వంశ రాజకీయాలను ప్రోత్సహస్తుంది. స్వయంగా పార్టీ అధినేత వైఎస్ జగనే రాష్ట్ర ముఖ్యమంత్రి చావు మీద పదేపదే కామెంట్స్ చేయడం, రాష్ట్ర రాజధాని కి వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వడం, పెట్టుబడి దారులను భయపెట్టేలా, పారిశ్రామిక వేత్తలను తరిమేసేలా, అధికారులను బెదిరించేలా హెచ్చరికలు చేయడం జైన్ జీ ల భవిష్యత్ కోసమా.? వైసీపీ క్యాడర్ ని నిలబెట్టుకోవడం కోసమా.?

ADVERTISEMENT
Latest Stories