కేంద్రానికి కాపులంటే అంత అలుసా? ఇంతటి నిర్లక్షమా?

Chandrababu-Naidu - Rajnath Singhకేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) కాపు రిజర్వేషన్‌ బిల్లును నిలిపి ఉంచాలంటూ కేంద్ర హోంశాఖకు సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదు కాబట్టి దానిని రాష్ట్రానికి తిప్పి పంపాలని హోంశాఖకు సూచించింది. అయితే ఈ మేరకు డీవోపీటీ రాసిన లేఖ చూస్తే కేంద్రానికి కాపులంటే అంత అలుసా? ఇంతటి నిర్లక్షమా? అని అనిపించక మానదు.

ADVERTISEMENT

సదరు లేఖ అంత తప్పుల తడకగా ఉంది. కోటా అడిగేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైతే ‘కోటా ప్రతిపాదనలకు ప్రాతిపదిక ఏమిటో తెలంగాణ ప్రభుత్వం వివరించలేదు’ అని పేర్కొంది. అసలు కాపు కోట్లకు సంబంధంలేని ఒక కమిషన్‌ గురించి కూడా ఆ లేఖలో ప్రస్తావించింది. బహుశా… కాపుల కోటా బిల్లు అంశాన్ని కూడా ఈ కమిషన్‌ పరిధిలోకి తీసుకురావాలన్నది డీవోపీటీ ఉద్దేశం కావొచ్చునని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనివల్ల మొత్తం కథ ముందుకు వస్తుంది

ఎన్నికల లోపు ఇది పరిష్కారం అయ్యేది కాదు. రాష్ట్రాన్ని కుదిపేసిన ఇంత కీలక అంశంపై ఇంతటి నిర్లక్షమా? బీజేపీకి అంశంపై చిత్తశుద్ధి లేకపోవడంతో హోంశాఖ పేషీలోని అధికారులు కూడా తేలికగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. కనీసం ఒక బిల్లును ఏ రాష్ట్రం పంపిందో కూడా సోయ లేకపోతే వారు ఈ అంశాన్ని ఏమి సీరియస్ గా తీసుకున్నట్టు?

కనీసం కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా పట్టించుకోలేదు అనే అనుకోవాలి. దీనికి బీజేపీ రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. మరోవైపు కాపు నేత ముద్రగడ పద్మనాభం మార్చి 31 లోగా రేజర్వేషన్లు అమలులోకి తీసుకుని రాకపోతే మరింత కఠినంగా ఉద్యమాన్ని నడిపించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

ADVERTISEMENT
Latest Stories