చంద్రబాబు ఎఫెక్ట్ – లండన్ లో అమరావతి!

Chandrababu London photoమూడు రోజుల పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన చంద్రబాబు శనివారం నాడు పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు లండన్ మ్యూజియంలో అమరావతి గ్యాలరీని చంద్రబాబు సందర్శించారు. ఆ గ్యాలరీలో ఏర్పాటు చేసిన అమరావతి శిల్పాలను చంద్రబాబు బృందం పరిశీలించింది. బ్రిటిష్ మ్యూజియానికి అమరావతి శిల్పాలు చేరిన వైనాన్ని అడిగి తెలుసుకున్నారు.

లండన్ లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించిన చంద్రబాబు, పలు ప్రాంతాల్లో పర్యటించి, విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక అభివృద్ధి మండలి ద్వారా పెట్టుబడిదారులతో ఈడీబీ సీఈఓ కృష్ణ కిశోర్ సంప్రదింపులు జరపగా, లండన్ లో అమరావతి కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories