చంద్రబాబు చాణక్య నీతికి చిత్తు అవుతున్న ప్రతిపక్షాలు

Chandrababu Naidu -5 percent kapu reservationదాదాపు మూడు నెలలలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వెళ్ళబోతుంది. ఈలోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాజంలోని వివిధ వర్గాలను టార్గెట్ చేస్తూ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఏపీలోని సామాజిక పింఛన్లను ఒక్కసారిగా రేటింపు చేసి దాదాపుగా 54 లక్షల మందికి మేలు కలిగించారు. దీనికే ప్రతిపక్ష పార్టీలు విలవిల్లాడుతున్నాయి. ఇక ఏమి చెయ్యాలో తెలియక చంద్రబాబు మా పధకాలు కాపీ కొడుతున్నారు అంటూ ముష్టి యుద్ధాలకు దిగుతున్నాయి.

అయితే ఫైనల్ గా ప్రజలకు మేలు కలిగింది. చేసింది చంద్రబాబు. చరిత్ర అంతవరకే గుర్తు పెట్టుకుంటుంది కదా. దీని నుండి తేరుకోకముందే డ్వాక్రా మహిళలకు 10000, స్మార్టు ఫోన్ అంటూ ప్రకటించేశారు. అంతటితో ఊరుకోకుండా ఇప్పుడు కాపులకు 5% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా ముందుకు పోతున్నారు. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాలలో పెట్టి ఆమోదించే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. అధికారాలు ఇప్పటికే ఆ పనులలో నిమగ్నం అయ్యారు.

ADVERTISEMENT

దీనిని ఎలా ఎదురుకోవాలి అనేది ప్రతిపక్ష పార్టీలకు అంతు చిక్కకుండా పోయింది. చంద్రబాబు నాయుడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. కాపు కులానికే చెందిన బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కూడా ఇదే మాట పలికించారు. ఇప్పుడు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామంటే ఆపుతున్నారు అనే మెస్సేజ్ ఆ వర్గాల ప్రజలలోకి వెళ్ళిపోతుంది. దీనితో అన్ని పార్టీల వారు దీని పై కనీసం మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి.

ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పరిస్థితి అయితే మరీ ఘోరం. గతంలో కాపు రిజర్వేషన్ల కోసం సభ కేంద్రానికి తీర్మాణం చేసి పంపిస్తే అప్పుడు ఆ పార్టీ సభలో లేదు. ఇప్పుడు ఈ 5% రిజర్వేషన్ల సందర్భంగా కూడా వైకాపా సభను బహిష్కరించే అవకాశం ఉంది. దీనితో కాపులకు ఖచ్చితంగా తప్పు మెస్సేజ్ వెళ్లి వారికి ఎన్నికలలో నష్టం జరగడం ఖాయం. జనాభాలో 15% ఉన్న కాపులతో పెట్టుకోవడం అంటే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టే. ఈ క్రమంలో చంద్రబాబు చాణక్య నీతికి చిత్తు అవుతున్న ప్రతిపక్షాలు

ADVERTISEMENT
Latest Stories