సిఎం చర్చలు జరుపుతుంటే నిరసనలు సబబేనా?

Chandrababu Naidu meeting AP government employees and teacher union leaders

నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సిఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖి సమావేశం కాబోతున్నారు. వారిని అమరావతిలో తన క్యాంప్ కార్యాలయంలో చర్చలకు ఆహ్వానించారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్స్ ఇవి:

ADVERTISEMENT

· కొత్త పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఏర్పాటు, ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్).

· పెండింగ్‌ కరువు భత్యం (డీఏ) వాయిదాల విడుదల, ఇతర పాత బకాయిల క్లియరెన్స్‌.

· రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు పింఛను

· ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్), సరెండర్ లీవ్స్ చెల్లింపులు,

· సచివాలయ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది సేవా నిబంధనల క్రమబద్ధీకరణ వగైరా.

· మున్సిపల్ కార్పోరేషన్ ఉద్యోగులకు ప్రత్యేక సర్వీస్ రూల్స్

· గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం

· అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పధకాలకు అర్హత కల్పించడం

· విద్యుత్ బస్సులను ఏపీఎస్ ఆర్టీసీయే నిర్వహించడం వంటి అనేక అంశాలపై నేడు సిఎం చంద్రబాబు నాయుడుతో జేఏసి నేతలు చర్చించనున్నారు.

వీటిలో అన్నిటి కంటే కీలకమైనవి కొత్త పీఆర్సీ ఏర్పాటు, ఉద్యోగుల బకాయిల చెల్లింపు. కొత్త పీఆర్సీ ఏర్పాటుకు, అలాగే రెండు లేదా మూడు వాయిదాలలో బకాయిల చెల్లింపుకు సిఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలుపుతారని జేఏసి నేతలు ఆశాభావంతో ఉన్నారు.

నేటి సమావేశంలో ఏపీ జేఏసి అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రెటరీ జనరల్ పలిశెట్టి దామోదర రావు తదితరులు పాల్గొనబోతున్నారు.

సిఎం చంద్రబాబు నాయుడుతో జేఏసీ నేతల చర్చలు విఫలమైతే ఉద్యోగులు ఆందోళన చేసినా అర్ధముంటుంది. కానీ ఓ పక్క సిఎం వారితో చర్చలు జరుపుతున్నప్పుడు, రాష్ట్రవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసనలకు చేపట్టాలనుకోవడం సబబేనా?

ADVERTISEMENT
Latest Stories