చంద్రబాబు చారిత్రక అవకాశాన్ని వదులుకున్నారా?

Chandrababu Naidu Caste based reservationsగతంలో బిసి కమిషన్ సభ్యులు ఐదుగురు విడిగా ఒక నివేదికను తయారు చేసి కాపులకు రిజర్వేషన్ కు అనుకూలంగా సిపారస్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కొంత అనుమానసపదంగా వ్యవహరించిన కారణంగా చైర్మన్ మంజూనాద నివేదిక లేకుండానే ఆ తంతును పూర్తి చేసింది.

ADVERTISEMENT

అయితే తాజాగా మంజునాథ కమిషన్ సభ్య కార్యదర్శి ద్వారా తన నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ఆయన అగ్రవర్ణాలలోని పేదలకు ఐదునుంచి ఎనిమిది శాతం రిజర్వేషన్ లను కల్పించాలని సిఫారస్ చేసినట్లు వార్త వచ్చింది. అయితే ఇదే నివేదిక అప్పుడే తెప్పించుకుని కాపులతో పాటు అన్ని అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కలిపిస్తే చంద్రబాబు చారిత్రాత్మక నిర్ణయం తీస్కున్నట్టు అయ్యేది.

దశాబ్దాలుగా రేజర్వేషన్ల ప్రక్రియ పట్ల అగ్రవర్ణాలకు ముఖ్యంగా పేదలకు తీవ్ర నిరాశ ఉంది. అన్ని అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కలిపిస్తే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఉండేది. ఎలాగూ కాపులు తమలోని పేదలకే రిజర్వేషన్లు ఇమ్మని అన్నారు గనుక వారు స్వాగతించేవారు.

ఒకరకంగా పెద్ద అవకాశాన్ని ఆయన వదులుకున్నట్టు అయ్యింది. ఒకవేళ ఆలా చేసి ఉంటే మొదటిసారిగా ఒక రిజర్వేషన్ ప్రక్రియకు అగ్రవర్ణాల వారి మద్దత్తు కూడా లభించేది. కాపులకు రిజర్వేషన్లు అయినా అగ్రవర్ణాల పేదలకు రేజర్వేషన్లు అయినా ఇప్పటికే 50% కోటా దాటేసిన కారణంగా కేంద్రం దయతలిస్తేనే అది సాధ్యపడుతుంది.

ADVERTISEMENT
Latest Stories