బాబుపై అదే పాత ట్యూన్ … వైసీపి కోరస్ దేనికంటే…

YSRCP-Peddireddy-Ramachandra-Reddy-Three-Capitals

పోలింగ్‌ జరిగిన మర్నాటి నుంచి టిడిపి, జనసేనలు చాలా ఉత్సాహంతో కనిపించగా, వైసీపిలో సజ్జల రామకృష్ణా రెడ్డితో సహా అందరూ ఆర్తనాధాలు చేశారు. వైసీపిలో నేటికీ చాలా మంది దిగులుగానే ఉన్నారు. అంటే టిడిపి కూటమి గెలువబోతోందని, వైసీపి ఓడిపోబోతోందని దీంతోనే తేలిపోయింది.

ADVERTISEMENT

కానీ వైసీపిలో అందరూ “కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నారంటూ,” మళ్ళీ కొత్తరాగం ఆలపించడం ప్రారంభించారు. జగన్‌ లండన్‌ వెళ్ళే ముందు ఐప్యాక్ బృందాన్ని కలిసిన తర్వాత నుంచే వైసీపిలో ఈ మార్పు వచ్చింది.

ఎలాగూ ఓడిపోతున్నప్పుడు, ఓటమి ఖరారు కాక మునుపే ఏడుస్తూ ఓటమిని స్వయంగా చాటుకోవడం కంటే జూన్ 4వరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడమే మంచిదని ఐప్యాక్ సలహా ఇచ్చిందేమో?

ఆలోగా ఇలా ‘కుప్పంలో చంద్రబాబు నాయుడు, మంగళగిరిలో నారా లోకేష్‌, పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ ఓడిపోతున్నారంటూ’ దుష్ప్రచారం చేస్తూ కూటమిలో గెలిచే అభ్యర్ధులలో అనుమానాలు, అపనమ్మకం సృష్టించగలిగితే, ఒకవేళ వైసీపికి, కూటమికి పూర్తి మెజార్టీ రాకపోతే అప్పుడు కూటమిలో నుంచి ఎమ్మెల్యేలను లాగేసుకోవడం సులువు అవుతుందని ఐప్యాక్ సలహా ఇచ్చి ఉండవచ్చు.

వైసీపి నేతలు హటాత్తుగా ఇలా కొత్తపాట కోరస్ పడటానికి మరో బలమైన కారణం కూడా కనిపిస్తోంది. ఇంతకాలం టిడిపి, జనసేనలతో ఒక ఆట ఆడుకున్నందున ఒకవేళ ఈ ఎన్నికలలో ఓడిపోతే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్న కొందరు వైసీపి నేతలు, వారి అనుచరులకు ధైర్యం చెప్పి క్యాడర్ చెల్లాచెదురు కాకుండా కాపాడుకోవడం కోసం వైసీపి నేతలు ఈవిదంగా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు.

జగన్‌ ఐప్యాక్ బృందాన్ని కలిసిన తర్వాత నుంచే మళ్ళీ వైసీపి సోషల్ మీడియా కూడా యాక్టివ్‌ అవడం గమనిస్తే, వైసీపి యుద్ధానంతర పరిస్థితులకు అప్పుడే సన్నాహాలు చేసుకుంటున్నట్లే ఉంది. అంటే చివరి నిమిషం వరకు… చివరి ప్రయత్నంగా పట్టరా పట్టు హైలెస్సా… అంటున్నారనుకోవాలేమో?

ADVERTISEMENT
Latest Stories