కూటమి, డబుల్ ఇంజన్, జోడు గుర్రాల సవారీ… బాబుకే చెల్లు!

Chandrababu Naidu drives AP growth again

కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మొదటి పదేళ్ళు చాలా కీలకం. ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఆ కీలక దశలో బాగా స్థిరపడింది. కానీ రాష్ట్ర విభజనతో ఒకసారి, 5 ఏళ్ళ వైసీపీ పాలనతో మరోసారి అతిపెద్ద ఎదురుదెబ్బలు తిన్న ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి దయనీయంగా మారింది. కనుక ఇక కోలుకోవడం కష్టమే అనుకుంటున్న సమయంలో మళ్ళీ సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

ఈ వయసులో కూడా సిఎం చంద్రబాబు నాయుడు సవాళ్ళను స్వీకరించి ధైర్యంగా ముందుకు సాగగలరని నిరూపిస్తున్నారు. మూడు పార్టీల కూటమిని ఒక్కటిగా నిలిపి ఉంచడమే చాలా కష్టం అనుకుంటే వాటితో విజయవంతంగా ప్రభుత్వాన్ని కూడా నడిపిస్తున్నారు. అలాగే కేంద్రంతో సఖ్యతగా, తెలివిగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి భారీగా ప్రాజెక్టులు సాధిస్తున్నారు.

ADVERTISEMENT

మూడు పార్టీల కూటమి, డబుల్ ఇంజన్ సర్కార్, అభివృద్ధి, సంక్షేమ పధకాల జోడు గుర్రాలపై సవారీ చేస్తున్న సిఎం చంద్రబాబు నాయుడుని చూసి పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలే ఆశ్చర్యపోతున్నారు.

అభివృద్ధి అంటే ఓ డజను కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇవ్వడం కాదు… అటు చిత్తూరు, నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందడం అని సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించి చూపుతున్నారు.

ప్రధాని మోడీ రేపు (గురువారం) కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నారు. అయన చేయబోయే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల జాబితా చూస్తే రాష్ట్రాభివృద్ధి అంటే ఇదీ అనిపిస్తుంది.

1. కర్నూలు జిల్లా ఓర్వకల్, కొప్పర్తిలో పారిశ్రామిక కారిడార్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.

2. జిల్లాలో పాపాగ్ని నదిపై కొత్త వంతెనకు, కనిగిరి -ఎస్.గుండ్లపల్లి బైపాస్ రోడ్డు పనులకు శంకుస్థాపన.

3. కర్నూల్ పూలింగ్ స్టేషన్-జాతీయ గ్రిడ్ అనుసంధానం చేసే ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు శంకుస్థాపన.

4. గుడివాడ-నుజెళ్ళ మద్య రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన.

5. పీలేరు-కాలూరు మద్య నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన.

6. విశాఖ-అనకాపల్లి జిల్లాలను కలుపుతూ సబ్బవరం-షీలా నగర్‌ మద్య గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన.

7. విజయనగరం-కొత్త వలస మద్య నాలుగో రైల్వే లైన్ ప్రారంభోత్సవం.

8. విశాఖ వెస్ట్ పరిధిలో పెందుర్తి-సింహాచలం మద్య నిర్మించిన రైల్ ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం.

9. శిమిలిగూడా-గోరక్‌పూర్ రైల్వే సెక్షన్, కొత్తవలస-బోద్దవార రైల్వే సెక్షన్, గెయిల్ పైప్ లైన్ ప్రాభోత్సవం.

వీటిలో ఒక్క కర్నూలు జిల్లాలో పనుల విలువే రూ. 13,430 కోట్లు కాగా, మిగిలిన వాటి విలువ మరో రూ.3,300 కోట్లు. కర్నూలు జిల్లాలో ఏర్పాటు కాబోతున్న జాతీయ పారిశ్రామిక కారిడార్‌లో సుమారు రూ.21,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి లక్ష మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది.

దీనిలో భాగంగా దేశంలో తొలిసారిగా ఓర్వకల్‌లో డ్రోన్‌లు, విడిభాగాల తయారీ, మరమత్తులు, శిక్షణ సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి. కనుక దేశంలో ఇదే మొట్ట మొదటి డ్రోన్ సిటీగా నిలువబోతోంది.

ADVERTISEMENT
Latest Stories