చంద్రబాబు బీజేపీని నమ్మడం మానేశారా?

Arun Jaitley - Chandrababu Naidu- Y Srujana Chowdary-శుక్రవారం రాత్రి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కొన్ని కీలక సంఘటనలు జరిగాయి. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ, రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో సుజనా చౌదరి సుమారు రెండున్నర గంటల పాటు చర్చించి ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, విశాఖ రైల్వేజోన్‌, పలు సంస్థల ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చించారు.

ADVERTISEMENT

ఈ సంధర్భంగా జైట్లీ కొన్ని కీలక హామీలు ఇచ్చారు. మర్చి 5 లోగా ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చబోతున్నట్టు చెప్పారు. ఆ లోగా విశాఖ రైల్వేజోన్‌ కూడా ప్రకటిస్తారట. అయితే చంద్రబాబు దీనిపై ఆచితూచి స్పందించారట. గతంలో ఇలాంటి మాటలు చాలా చెప్పారని కాబట్టి కేంద్రాన్ని పూర్తిగా నమ్మడానికి లేదని చెప్పారంట.

మీడియాలో కేంద్రాన్ని సమర్ధించవద్దని, మర్చి 5 వరకు వెచ్చి చూసే ధోరణి అవలంభించాలని చంద్రబాబు చెప్పారట. అదే సమయంలో బీజేపీ నేతలు ఎవరైనా విభజన హామీలకు సంబంధించి తప్పుడు లెక్కలు చెబితే ధీటుగా స్పందించాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. మర్చి 5 నుండి పార్లమెంట్ లో బడ్జెట్ పై చర్చ జరగబోతుంది. ఒకవేళ అప్పటికి ఏమి జరగకపోతే మరోసారి పార్లమెంట్ ను స్తంభింప చెయ్యడం, పొత్తుపై ఒక నిర్ణయం తీసుకోవడం చేద్దామని ఆయన అన్నట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories